టిడిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న తీరు సీనియర్లని అసంతృప్తికి గురి చేస్తోంది. పార్టీ ని విడిచి బయటకు వెళ్లిపోయే విధంగా అందరిని చేస్తోంది. విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని గురించి గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. పైగా చంద్రబాబు నాయుడు తీరు ఎలా ఉందనేది చెప్పడానికి కేశినేని నాని వ్యవహారమే ఉదాహరణగా తీసుకో వచ్చు కుటుంబాలని చీలుస్తారంటూ ఇది వరకు కాకినాడ వేదికగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేశినేని ఉదంతంలో నిజాన్ని దాల్చాయి.
అయితే, నానికి వ్యతిరేకంగా సొంత తమ్ముడు చిన్నిని ప్రోత్సహించారు దీంతో కేశినేని నాని తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తెలుగు దేశం కి గుడ్ బై చెప్పేసారు కేశినేని నాని అయితే ఇది ఇక్కడి తో ఆగేటట్టు కనపడలేదు. ఇక్కడే కాకుండా, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు సీనియర్ నేతలు ని కూడా పార్టీ నుండి బయటకి తీసుకు వచ్చే విధంగా కనబడుతోంది విజయవాడ టిడిపి యువ నాయకురాలు కేశినేని శ్వేతా పార్టీకి రాజీనామా చేయబోతున్నారు.
టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి ఆమె గుడ్ బై చెప్పేస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో 11వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిచిన ఆమె తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఉదయం పదిన్నర గంటల కి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాని కి వెళ్లి తన కార్పొరేట్ పదవికి రాజీనామా చేస్తానని దాన్ని ఆమోదింపు చేయించుకుంటారని నాని చెప్పారు. ఆ క్షణం తెలుగు దేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని వివరించారు. ఆయనే కాకుండా ఆయన కూతురు తో కూడా రాజీనామా చేస్తున్నారంటే, చంద్రబాబు వైఖరికి ఎంతలా విసిగిపోయారా తెలుస్తోంది. ఇక ముందు ముందు చంద్రబాబు నాయుడు తీరు కారణంగా ఇంకా ఎన్ని చోటు చేసుకోబోతున్నాయి అనేది చూడాలి.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!