ఎంపీ కేశినేని నాని మీద తీవ్ర స్థాయి లో టీడీపీ నేత కేశినేని చిన్ని మండి పడ్డారు ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్ కి ముఖ్య అనుచరుడిగా మారాడని అన్నారు కేశినేని చిన్ని. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే అటు వెళ్తున్నాడని వ్యాఖ్యానించారు కేశినేని నాని వైసీపీ లోకి వెళ్లిన తర్వాత ముగ్గురు నలుగురు కూడా నాని వెంట లేరని ఆయన చెప్పారు. కేశినేని నాని కి విజయవాడ ప్రజల బుద్ధి చెప్పడానికి రెడీ అయ్యారని కూడా కేశినేని చిన్ని అన్నారు.
Advertisement
Advertisement
అంతే కాకుండా కృష్ణా జిల్లాలలో టిడిపి ని ఖాళీ చేయడం కేశినేని నాని వల్ల కాదన్నారు చిన్ని. కొడాలి నాని లానే కేశినేని నాని కూడా బూతులు మాట్లాడుతున్నాడని మండి పడ్డారు మేము గేట్లు తెరిస్తే రావడానికి వైసిపి నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు. అలానే దుష్ట పరిపాలన అంతమొందించడమే చంద్రబాబు లక్ష్యమని కూడా కేశినేని చిన్ని చెప్పారు ప్రస్తుతం కేశినేని నాని పై చిన్ని చేసిన కామెంట్స్ చర్చనీయాంశం గా మారింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!