Home » కేరింత మూవీ హీరోయిన్ పెళ్లి… వరుడు ఎవరంటే..?

కేరింత మూవీ హీరోయిన్ పెళ్లి… వరుడు ఎవరంటే..?

by Sravya
Ad

చాలామంది నటీనటులు పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది పెళ్లిళ్లు ఫిక్స్ అయిపోయాయి. వరుసగా అందరు పెళ్లి పీటలు కూడా ఎక్కేస్తున్నారు. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కూడా ఒకటవబోతున్నారు. నటుడు అర్జున్ కూతురు ఐశ్వర్య ఎంగేజ్మెంట్ కూడా అయింది. వెంకటేష్ కూతురు ఎంగేజ్మెంట్ కూడా అయింది. తాజాగా ఇంకో తెలుగు హీరోయిన్ కూడా పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement

ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రీదివ్య. నటి శ్రీదివ్య మహేష్ బాబు హీరోగా చేసిన యువరాజు అలానే హనుమాన్ జంక్షన్, వీడే వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనపడింది. బస్ స్టాప్, కేరింత, మనసారా వంటి సినిమాల్లో నటించింది. తమిళంలో కూడా ఈమె ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది శ్రీ దివ్య. నా ప్రియుడిని నేను పెళ్లి చేసుకోబోతున్నానని క్లారిటీ ఇచ్చేసారు శ్రీ దివ్య. స్వయంగా తన లవర్ ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. అలానే అతను ఎవారా అని అంతా ఆరా తీస్తున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

 

Visitors Are Also Reading