ఈ ఫోటో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంది. అబ్బబ్బ ఏం అందం అంటూ అందర్నీ నోరెళ్ళబెట్టేలా చేసింది. కానీ నిజమేంటంటే ఈ ఫోటోలో ఉంది అమ్మాయి కాదు అబ్బాయి. కేరళలోని కొల్లం జిల్లాలోని కొట్టంకులకరలోని దేవి ఆలయంలో చమయవిళక్కు అనే పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో పురుషులు స్త్రీల వేషంలో అలంకరించుకొని పోటీపడతారు. మనదగ్గర సంక్రాతికి కోళ్ళపందాల మాదిరిగా అక్కడ ఈ పోటీలు జరుగుతాయి. ఆ పోటీల్లో ఫస్ట్ ఫ్రైజ్ గెలుచుకున్న అబ్బాయి ఫోటోనే ఇది. చమయవిళక్కు పండుగను మార్చి నెల చివర్లో జరుపుకుంటారు. దీనిని లైట్ల పండుగ కూడా అంటారు.
Advertisement
Advertisement
పురుషులు ఇలా స్త్రీల వేషం వేయడానికి సంబంధించిన ఒక పురాణం కూడా ఉంది. ఒక భక్తుడకి భగవతి దేవి కలలో కనిపించి తన పూజకోసం దీపాలను వెలిగించమని చెప్పిందట! అప్పటి నుండి ఈ పండుగ సందర్భంగా అబ్బాయిలు అమ్మాయిలుగా వేషం వేసుకొని దీపాలను (విళక్కు) వెలిగించి, వాటిని పట్టుకొని గుడి చుట్టూ ప్రదిక్షణలు చేస్తారు. అందుకే ఈ పండుగకు చమయవిళక్కు అనే పేరు వచ్చింది. పురుషులు స్త్రీ వేషం ధరించి దీపాలు వెలిగించి ఆలయ ప్రదక్షిణ చేస్తే వారు కోరుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరతాయట! ట్రాన్స్ జెండర్లు కూడా ఈ పూజలో పెద్దఎత్తున పాల్గొంటారు.