టీమిండియా సొగసరి ఆటగాడు కరుణ్ నాయర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు కరుణ్ నాయర్ తన కెరీర్ లో 76 భారత టి20 లీగ్ మ్యాచ్ ల్లో ఆడి పర్వాలేదని అనిపించాడు. 85 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో దాదాపు 50 సగటుతో 5922 పరుగులు చేశాడు. అటు టెస్ట్ మ్యాచ్ ల లోను ఈ కరుణ్ నాయర్ అదరగొట్టాడు. 2016 చెన్నై వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టుల్లో 303 పరుగులు చేసిన రికార్డుతో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.
దీంతో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత త్రిశతకం సాధించిన భారత ఆటగాడిగా అప్పట్లో ఇతడి పేరు మార్మోగింది. భవిష్యత్తులో స్టార్ ఆటగడిగా ఎదుగుతాడని అంత భావించారు. కానీ, 2017 లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ల్లో వరుస వైఫల్యాలు అతడిని కుదిపేశాయి. టెస్ట్ జట్టులో స్థానం కోల్పోయిన తరువాత దేశం తరఫున కరుణ్ ఆడలేదు. సుదీర్ఘకాలం జట్టుల అవకాశాలు ఇవ్వకపోవడానికి గల కారణాలపై టీం మేనేజ్మెంట్ తనకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని ఈ ఆటగాడు గతంలో ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement
దీంతో దేశవాలి క్రికెట్ లో కర్ణాటక జట్టు తరపున కొనసాగారు. కానీ, కొంతకాలం తర్వాత ముస్తాక్ ఆలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ వంటి రాష్ట్రస్థాయి జట్టుల్లో కూడా ఇతడికి చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో కరుణ్ ట్విటర్ వేదికగా భావోద్వేగ పోస్ట్ ను పంచుకున్నాడు. “డియర్ క్రికెట్, నాకు మరొక ఛాన్స్ ఇవ్వు” అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిన ఈ ట్విట్ అభిమానులను కదిలించింది. క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. “సోదరా, నీ త్రిశతకాన్ని మేమింకా మర్చిపోలేదు. నువ్వు కచ్చితంగా మళ్ళీ నిరూపించుకుంటావు” అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
READ ALSO : బాలయ్య తన కూతుర్లని ఎందుకు హీరోయిన్స్ చేయలేదో తెలుసా..?
Dear cricket, give me one more chance.🤞🏽
— Karun Nair (@karun126) December 10, 2022