బెంగుళూరుతో పోల్చితే మైసూర్ కు చారిత్రక నేపథ్యం ఉంది.బెంగుళూర్ మైసూర్ రాజ్యంలో ఓ పార్ట్! అయినప్పటికీ కర్నాటక రాజధానిగా మైసూర్ ను కాదని బెంగుళూరును చేయడానికి ప్రధాన కారణం బ్రిటీషర్లు. ఈ విషయాన్ని కాస్త డెప్త్ గా ఆలోచిస్తే……
14వ శతాబ్దం నుంచి వడయార్ వంశం మైసూర్ రాజ్యాన్ని పాలించింది. భారతదేశాన్ని బ్రిటీషర్లు పాలించిన క్రమంలో వారితో సంధి చేసుకొని వారికి అనుగుణంగానే పరిపాలన సాగించారు వడియార్లు. అప్పట్లో బెంగళూరు మైసూర్ రాజ్యంలో ఒక పార్ట్…..కానీ దానిపై బ్రిటీషర్లు పూర్తి ఆదిపత్యం కలిగి ఉండేవారు. దీంతో వారు ఆ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసుకుంటూ పోయారు. అక్కడి వాతావరణం కూడా బ్రిటీషర్లకు అనుకూలంగా ఉండడంతో ఆ ప్రాంత అభివృద్ధిపై ఎక్కువ దృష్టి సారించారు.
Advertisement
Advertisement
Also Read: నా కూతురు రిక్షా ఎక్కుదామని వెళ్లి కాలు పోగొట్టుకుంది : కోట శ్రీనివాసరావు
బ్రిటన్ నుండి వచ్చే వ్యాపారస్థుల కోసం రైల్వే లైన్ వేయించడం, టెలిఫోన్, టెలిగ్రాఫ్ సౌకర్యాలు కల్పించడం. హాస్పిటల్స్, థియేటర్లు, యూనివర్సిటీలు నిర్మించడం లాంటివి చేశారు. అక్కడ బ్రిటీష్ కాలనీలు కూడా వెలిశాయి. విద్యుత్ ఏర్పాటు కూడా చేశారు. మైసూర్ రాజ్యంలో విద్యుత్ వచ్చిన మొదటి ప్రాంతం బెంగళూరే! సాంకేతికంగా కూడా బెంగళూరును బ్రిటీషర్లు బాగా అభివృద్ధి చేశారు. దీంతో స్వాతంత్రం వచ్చాక అనేక సదుపాయాలున్న బెంగుళూరు నే రాజధానిగా చేసుకున్నారు.
Also Read: చెల్లించని చలాన్లు రూ.600 కోట్లు.. ఇక జరిమానాలో తగ్గింపు : జాయింట్ సీపీ రంగనాథ్