అలనాటి నటుడు కాంతారావు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు ఆయన చాలా సినిమాలతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ల తర్వాత జానపద సినిమాల్లో నటించిన హీరోగా ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందిన వారైనా ఆంధ్ర ఎంజీఆర్ గా ఈయనకి పేరు ఉంది. కత్తి కాంతారావు మొదట్లో 600 ఎకరాలు ఆస్తి ఉన్న కోటీశ్వరుడు. కానీ సినిమాల మీద ఉన్న పిచ్చితో మొత్తం 600 ఎకరాలని కూడా అమ్మేశారు. హీరోగా కంటే ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అందర్నీ ఆకట్టుకునేవారు. డబ్బులను మాత్రం ఈయన సంపాదించలేకపోయారు.
Advertisement
ఎన్టీఆర్ ఏఎన్నార్లు సొంత బ్యానర్లలో సినిమాలు తీయడం చూసి ఆయన కూడా సొంతంగా ఒక బ్యానర్ ని స్థాపించారు. స్వయంగా ఆయనే సినిమాలని ప్రొడ్యూస్ చేసేవారు అప్పుల్లో ఆయన కూరుకుపోయిన సమయంలో స్టార్ హీరోయిన్ వాణిశ్రీ ఆయన దగ్గరికి వచ్చి ప్రస్తుతం మార్కెట్లో మంచి క్రేజ్ నాకు ఉంది. నన్ను మీ సినిమాల్లో పెట్టి సినిమా తీయండి కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని ఆమె చెప్పారు.
Advertisement
ఆమె మాటలు నమ్మిన కాంతారావు స్వాతి చినుకులు అనే సినిమాని రమ్యకృష్ణ, జయసుధ, వాణిశ్రీ ని పెట్టి తీశారు సినిమా షూటింగ్ పూర్తయి విడుదల అయ్యాక డిజాస్టర్ గా సినిమా నిలిచింది. డబ్బులు లేకపోవడంతో వాణిశ్రీ కి ఆయన ఫోన్ చేశారు కానీ వాణిశ్రీ మాత్రం స్పందించలేదుట ఇలా వాణిశ్రీని నమ్మి మోసపోయారు. ఆయన దగ్గర ఉన్న మిగిలిన ఆస్తి కూడా అమ్మేసి అప్పు కట్టారు. మద్రాసులో ఆయనకు ఉన్న ఇల్లుని కూడా అమ్మేసి హైదరాబాద్ కి వచ్చేసి అద్దె ఇంట్లో ఉండేవారు. సినిమాలకి దూరంగా ఉండడంతో డబ్బులు కూడా లేవుట తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఆయనకి వచ్చింది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!