ఐకన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప మొదటి పార్ట్ ఈ రోజు విడుదల అయింది. పాన్ ఇండియా రెంజ్ లో దాదాపు 3000 పై గా థీయేటర్స్ లలో విడుదల అయింది. అంతే కాకుండా ప్రీమియర్ షో లతో మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమా కు మాత్రం బాయ్‌కట్ భయం పట్టుకుంది. కన్నడ ప్రజల పుష్ప సినిమా పై తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు. ఈ సినిమాను కర్ణాటక లో బాయ్‌కట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Advertisement
అంతే కాకుండా ఎవరూ కూడా ఈ సినిమా చూడవద్దని పిలుపు నిస్తున్నారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందు లో భాగం గా కర్ణాటక లో పుష్ప సినిమా ను చిత్ర బృందం విడుదల చేసింది. అయితే ఇక్కడే వివాదం చోటు చేసుకుంది. కర్ణాటక లో ఎక్కువ థీయేటర్స్ లలో తెలుగు భాష లలో నే పుష్ప సినిమా ను విడుదల చేశారు.
అయితే కర్ణాటక లో కన్నడ భాష లో విడుదల చేయాలి గానీ తెలుగు లో విడుదల చేయడం ఎంటి అని కన్నడ భాష అభిమానులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా కర్ణాటక లో నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా ను బాయ్‌కట్ చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఈ ఆందోళన పుష్ప కలెక్షన్ ల పై తీవ్ర ప్రభావం చూపుతుంది.