Home » కల్కి సినిమా కోసం కమల్ హాసన్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా..?

కల్కి సినిమా కోసం కమల్ హాసన్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా..?

by Sravya
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో కల్కి 2898 ఏడి సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పైగా సలార్ సినిమా హిట్ అయిన తర్వాత ప్రభాస్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఫాన్స్ కి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తోంది. అమితాబచ్చన్ దిశా పటాని కూడా ఈ సినిమాలో కనపడుతున్నారు. ఈ మూవీలో ప్రతి నాయకుడిగా కమల్ హాసన్ నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ ఎంట్రీ కల్కి పై మరింత పెరిగేలా చేసింది.

లోకనాయకుడు కమల్ హాసన్ కల్కి సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నారు. ప్రభాస్ కమల్ హాసన్ స్క్రీన్ ఫైట్ సినిమాకే హైలైట్ గా ఉండబోతోంది. కమల్ హాసన్ ఈ సినిమాలో నటించడానికి ఎంత రెమ్యూనిరేషన్ తీసుకున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరమీదకు తీసుకువస్తున్నారు. కల్కి సినిమాలో కమల్ హాసన్ కి ఎంత పారితోషకం ఇస్తున్నారని విషయానికి వచ్చేస్తే.. ఈ సినిమాలో నటించడానికి లోకనాయకుడు కమల్ హాసన్ 60 నుండి 70 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కమల్ పాత్ర కూడా ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా లో నటించేందుకుగాను కమల్ హాసన్ కి ఇలా భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఇక ప్రభాస్ కి అయితే 100 కోట్ల దాకా రెమ్యూనరేషన్ ఇస్తున్నారని టాక్ నడుస్తోంది.

Advertisement

Advertisement

ప్రభాస్ రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా కమల్ హాసన్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రభాస్ కమల్ హాసన్ ఇద్దరూ కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక కల్కి సినిమా మే 9న రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ చెప్పారు. రిలీజ్ అనుకునే టైంకి తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. రెండు భాగాలుగా సినిమా ని తీసుకువస్తున్నారు. మే లో మొదటి పార్ట్ రిలీజ్ అవుతుండగా సెకండ్ పార్ట్ కి ఇంకో ఏడాది టైం పడుతుందని తెలుస్తోంది. ఈ మూవీ ని హాలీవుడ్ రేంజ్ లో తీయబోతున్నారు వరల్డ్ వైడ్ గా కూడా భారీ రిలీజ్ ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading