పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి వంటి చిత్రాలతో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సంతోష్ శోభన్. అతను నటించిన కొత్త సినిమా కళ్యాణం కమనీయం సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈ మూవీలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ కాగా, దర్శకుడు అనిల్ కుమార్ అల్ల. శోభన్ నటించిన ఈ కళ్యాణం కమనీయం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ఊపందుకోవడంతో ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు.
Advertisement
మొదటి సగం ప్రారంభంలో నత్త నడకతో కూడిన కథనం ఉన్నప్పటికీ వారు పెళ్లి చేసుకున్న తర్వాత సరైన మొత్తంలో డ్రామా మరియు కామెడీతో మొదటి సగం ఆకర్షణీయంగా ఉంటుంది. మరియు ఇంటర్వెల్ బ్లాక్ తో రెండవ భాగం చూడటానికి ఆసక్తిని కలిగిస్తుంది. దీంతో ఫ్లాప్ అయింది. ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు ముస్తబవుతుంది. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహాలో ఫిబ్రవరి 17 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది.
Advertisement
ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనిల్ కుమార్ అల్ల దర్శకత్వం వహించాడు. మూవీ కాన్సెప్ట్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ ద్వారా సేఫ్ అయినట్టు తెలుస్తుంది. కేవలం నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే ఈ సినిమాకు దాదాపు రూ.7 కోట్లు ముట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ ఐదు కోట్ల లోపే పూర్తయింది. ఈ లెక్కన చూసుకుంటే నిర్మాతలకు థియేట్రికల్ రిలీజ్ లో వచ్చిన నష్టాలను డిజిటల్ రైట్స్ పూడ్చినట్లే.
read also : NTR “కొండవీటి సింహం”లో చిరును తప్పించి.. మోహన్ బాబుకు ఛాన్స్…దీనికి అసలు కారణం ఇదే!