Home » ప్రేమించిన‌వాడే ఆమె పాలిట య‌ముడ‌య్యాడు…పెళ్లికి నో చెప్పింద‌ని ఏం చేశాడంటే..?

ప్రేమించిన‌వాడే ఆమె పాలిట య‌ముడ‌య్యాడు…పెళ్లికి నో చెప్పింద‌ని ఏం చేశాడంటే..?

by AJAY
Ad

తాము ప్రేమించిన‌వాళ్లు ఎక్క‌డున్నా సంతోషంగా ఉండాల‌ని కోరుకోవ‌డమే నిజ‌మైన ప్రేమ‌. కానీ ఇటీవ‌ల కాలంలో అలా కోరుకోవడం కాదు క‌దా ఏకంగా ఈ లోకంలోనే లేకుండా చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి బెంగుళూరులో చోటు చేసుకుంది. గ‌తంలో ఇద్ద‌రూ ప్రేమించుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే యువ‌తి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోక‌పోవ‌డంతో ఆమెకు వేరే సంబంధాలు చూస్తున్నార‌ట‌.

ALSO READ :తుదిశ్వాస వ‌ర‌కూ నిన్నే ప్రేమిస్తా…. తార‌క‌ర‌త్న భార్య రాసిన‌ లేఖ వైర‌ల్..!

Advertisement

కానీ తాను ప్రేమించిన యువ‌తి మ‌రో వ్య‌క్తిని పెళ్లి చేసుకోవడం ఆ యువ‌కుడి న‌చ్చలేదు. దాంతో వేధింపుల‌కు గురి చేయ‌డం మొద‌లు పెట్టాడు. ఇక ఇప్పుడు ఏకంగా ఆమెను కాపుకాచి మ‌రీ హ‌త‌మార్చాడు. ఈ దారుణం బెంగుళూరులో చోటు చేసుకుంది.

Advertisement

కాకినాడ కు చెందిన లీలా ప‌విత్ర బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. కాగా గ‌త ఐదేళ్లుగా లీలా పవిత్ర బెంగుళూరులోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఆమె దిన‌క‌రన్ అనే వ్య‌క్తిని ప్రేమించిందట‌. అయితే లీలా ప‌విత్ర ఇంట్లో పెళ్లికి ఒప్పుకోక‌పోవ‌డంతో పాటూ సంబంధాలు చూడ‌టం మొద‌లు పెట్టార‌ట‌.

దాంతో త‌న ప్రియురాలు మ‌రొక‌రిని పెళ్లి చేసుకోవ‌డం ఇష్టం లేని దిన‌క‌ర‌న్ దారుణానికి ఒడిక‌ట్టాడు. తాను ప్రేమించిన అమ్మాయినే చంపేందుకు ప్లాన్ చేశాడు. బెంగుళూరులో యువ‌తి ఆఫీసుకు వెళుతుండ‌గా కాపుకాసి మ‌రీ హ‌త మార్చాడు. ఉద‌యాన్నే ఆమె ఆఫీసుకు వెళుతుండ‌గా క‌త్తితో ప‌ద‌హారు సార్లు పొడిచాడు. ఆ త‌ర‌వాత మృత‌దేహం ప‌క్క‌నే కూర్చున్నాడు. ప్ర‌స్తుతం నింధితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

ALSO READ :ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రానికి తారకరత్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading