Home » పెళ్లి తర్వాత వస్తున్న ఆఫర్లు కాజల్ కి తృప్తిని ఇవ్వడం లేదట… కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!

పెళ్లి తర్వాత వస్తున్న ఆఫర్లు కాజల్ కి తృప్తిని ఇవ్వడం లేదట… కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!

by AJAY
Ad

తెలుగు… తమిళ… హిందీ సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన నటిగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి కాజల్ అగర్వాల్ ఒకరు. లక్ష్మీ కళ్యాణం మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ మగధీర మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా మారిపోయింది.

Kajal Agarwal

Kajal Agarwal

ఆ తర్వాత నుండి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన కాజల్ చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. కొంతకాలం క్రితమే కాజల్ వివాహం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే కొన్ని రోజుల క్రితమే కాజల్ ఒక పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇలా పెళ్లి అయ్యి… ఒక బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మకు తెలుగు… తమిళ… హిందీ పరిశ్రమలలో వరస అవకాశాలు దక్కుతున్నాయి.

Advertisement

Advertisement

అందులో భాగంగా ప్రస్తుతం కాజల్ తెలుగులో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమాలను… తమిళ్ లో కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న మూవీలను… హిందీలో మరో మూవీలోను నటిస్తుంది. ఇలా వరుస క్రేజీ సినిమా అవకాశాలు కాజల్ కు పెళ్లి తర్వాత దక్కుతున్నప్పటికీ ఈ ఆఫర్లు ఈ ముద్దుగుమ్మకు పెద్దగా సంతృప్తిని ఇవ్వడం లేదట. కాజల్ కు పెళ్లి కాకముందు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు ఇతర ఇండస్ట్రీలలో కూడా యంగ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కుతూ ఉండేవి.

కాకపోతే ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన… అలాగే గ్లామర్ షోకు ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రల్లో అవకాశాలు దక్కుతున్నట్లు దానితో కాజల్ ప్రస్తుతం వస్తున్న సినిమా ఆఫర్లతో కాస్త అసంతృప్తిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Visitors Are Also Reading