Home » దయచేసి ట్రోల్స్ చేయకండి..జూనియర్ సౌందర్య ఎమోషనల్…!

దయచేసి ట్రోల్స్ చేయకండి..జూనియర్ సౌందర్య ఎమోషనల్…!

by AJAY
Published: Last Updated on
Ad

సౌత్ ఇండియా లో గొప్ప నటీమణుల్లో సౌందర్య ఒకరు. సౌందర్య ప్రస్తుతం మన మధ్యన లేకపోయినా ఆమె సినిమాలు ఆమె చేసిన పత్రాలు ఎప్పుడూ గుర్తుండి పోతాయి. అయితే మనుషులను పోలిన మనుషులు ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం సోషల్ మీడియా వచ్చిన తరవాత మరింత నిరూపితం అయ్యింది. సోషల్ టిక్ టాక్ , రీల్స్ ద్వారా మనుషులను పోలిన మనుషులు బయటకు వస్తున్నారు. ప్రస్తుతం అచ్చం విరాట్ కోహ్లీ లాంటి ఓ వ్యక్తి ఇన్స్టా లో కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు అచ్చం సౌందర్య లా కనిపించే మలేషియా కు చెందిన అమ్మాయి కూడా ఉంటుంది.

Junior sridevi

Junior sridevi

మలేషియా కు చెందిన చైత్ర అనే అమ్మాయి అచ్చం సౌందర్య లానే కనిపిస్తుంది. బేసిక్ గా చైత్ర భారత సంతతి కి చెందిన యువతి కాగా ఆమె తల్లిదండ్రులు మలేసియాలో స్థిరపడ్డారు. ఇక బిజినెస్ తో పాటి చైత్ర సోషల్ మీడియా లో సౌందర్య లాగా కనిపిస్తూ ఆమె పాటలకు రీల్స్ చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా తన పై ట్రోల్స్ వస్తున్నాయి అంటూ చైత్ర ఎమోషనల్ అయ్యింది. బాధతో ఓ వీడియోను షేర్ చేసింది.

Advertisement

Advertisement

వీడియో లో చైత్ర మాట్లాడుతూ….నా ముక్కు వంకర గా ఉందని…నా రంగు తక్కువగా ఉంది అని చాలా మండి ట్రోల్ చేస్తున్నారు. సౌందర్య కు నీకు పోలిక ఏంటి అంటున్నారు. నా ఉద్దేశ్యం నేను సౌందర్య లా ఉన్నా అని కాదు. ఆమె సినిమా నటి…నేను కేవలం అమెలా రీల్స్ చేస్తాను. అంతే నాకు చేయాలనిపిస్తుంది కానీ ఆమెలా ఉన్నాను అని చేయట్లేదు…ఎందుకో అలా చేయాలనిపిస్తుంది. దయ చేసి అలా విమర్శలు చేయద్దు…అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నా….” అంటూ జూనియర్ సౌందర్య వ్యాఖ్యానించింది. ఇక కొందరు నెటిజన్లు కూడా ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు.

also read : కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో చనిపోయిన తారలు వీరే..!

Visitors Are Also Reading