జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి A1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ ను తరలించారు. ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తున్నారా..? సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం తరలించారా అనేది సస్పెన్స్ లో ఉంది.
Advertisement
మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అర్థరాత్రి నుండే బీజేపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. మహిళల పట్ల కూడా కర్కశంగా వ్యవహరిస్తూ బలవంతపు అరెస్టులు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపదుతున్నారు.
గాంధీ భవన్ లో పార్టీ సీనియర్లు, డీసీసీ, పీఏసీ సభ్యులతో పీసీసీ సమావేశం నిర్వహించారు. సోమవారం ఈడీ కార్యాలయం ముందు ఆందోళనపై చర్చించనున్నారు. సోమవారం రాహుల్ గాంధీ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. రాహుల్ ఈడీ కార్యాలయంలో ఉన్నంత సేపు పార్టీ ఆందోళన చేపట్టనుంది.
కోవిడ్, పిల్లలు సరిగ్గా చదువుకోకపోవడం వలన ఉత్తీర్ణత తగ్గిందని మంత్రి రోజా అన్నారు. అచ్చెన్నాయుడికి టీడీపీపై కోపం. అందుకే పార్టీ మూసేస్తా అంటున్నాడు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నాడో చెప్పాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు.
జూన్ 23న విచారణకు హాజరుకావాలని సోనియా గాంధీకి ఈడీ ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
టిడిపి అధినేత చంద్రబాబు మరియు లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు కురిపించారు. అభివృద్ధి సంక్షేమం పై చర్చ ఊసే లేదని అన్నారు. తండ్రీకొడుకులు ఉన్మాదిలా మారి చివరికి స్కూల్ పిల్లల ను కూడా వదలడం లేదని విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.
బీటెక్ ఫార్మసి విద్యార్థులకు జేఎన్టియు హైదరాబాద్ గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులు పరీక్షలను తమ సమీప గ్రామాల్లో రాసుకునేలా వెసులు బాటు కల్పించింది.
తెలంగాణ హైకోర్టు కీలక ప్రకటన చేసింది. 15 ఏళ్ళలోపు వాహనాలకు ఫిట్నెస్ గడువు ఉండదని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం 15 ఏళ్లు దాటిన వాహనాలకు గడువు ముగిసిన తర్వాత రోజు నుండి లెక్కించే రోజుకు యాభై రూపాయల చొప్పున జరిమానా వేయాలని హైకోర్టు తెలిపింది.
గడచిన 24 గంటల్లో దేశంలో 8,329 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. ఈనెల 8వ తేదీన ఋతపవనాలు రాష్ట్రంలోకి రావాల్సి ఉండగా సముద్రపు గాలులు బలహీనంగా ఉండటం వల్ల నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయి. దాంతో మొదట వేసుకున్న అంచనాలు తప్పడంతో మరో రెండు రోజుల తర్వాత నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.