భారత్‌లో కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. దేశం లో కొత్తగా 21,180 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 60 మంది కరోనా బాధితులు మృతి చెందారు.
ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 14 వేల మంకీపాక్స్ కేసులు నమొదయ్యాయి. 70 దేశాలకు మంకీపాల్స్ కేసులు వ్యాపించాయి. ఆఫ్రికాలో మంకీపాక్స్‌తో ఐదుగురు మృతి చెందారు.
Advertisement
ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు శ్రీశైలం ప్రాజెక్ట్ ను పరిశీలించనున్నారు. రేపు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయనున్నారు.
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, టోలిచౌకి, మణికొండ, గచ్చిబౌలి, లింగంపల్లి, అంబర్‌పేట్, రామంతాపూర్, ఉప్పల్ లో వర్షం పడుతోంది.
నేడు భారత్-వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. వెస్టిండీస్‌తో టీమ్ ఇండియా 3 వన్డేలు ఆడబోతుంది.
Advertisement
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రధాని మోడీ, అమిత్‌షా నుండి ఆహ్వానం అందింది. తనను ఆహ్వానించినందుకు పవన్ కల్యాణ్ వారికి కృతజ్ఞతలు చెప్పారు.
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ఈ నెల 25న రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సగానికిపైగా ఓట్లు సాధించి ద్రౌపది ముర్ము భారత తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
తెలంగాణ లో 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 28 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది.
కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేమని…కాళేశ్వరానికి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ లేదు అంటూ కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ ప్రాజెక్టు స్కీంలోకి కాళేశ్వరాన్ని చేర్చే అర్హతలేదని తేల్చి చెప్పింది.