భూములకోసం జరిగే గొడవలు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. దారుణమైన గొడవల్లో ప్రాణాలు కోల్పయిన ఘటనలు కూడా కనిపిస్తుంటాయి. అన్నదమ్ములైనా భూముల విషయంలో గొడవలు వస్తే కొట్టుకుని చంపుకుంటారు. ఇక తాజాగా భూమికి సంబంధించి ఇరువర్గాల మధ్య గొడవ జరగటంతో ఓవర్గం వారు మహిళ అనే కనికరం లేకుండా ఏకంగా జేసీబీతో ఆమెపై దాడికి యత్నించారు. జేసీబీతో మహిళను నరికేందుకు ప్రయత్నించారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు విచారణ జరపగా రాజస్థాన్ లోని బార్మర్ ప్రాంతం బైతు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నట్టు గుర్తించారు.
ఇక ఈ వీడియోలో జేసీబీతో మహిళపై దాడికి ప్రయత్నిస్తుండగా ఓ పురుషుడు ఆమెను గట్టిగా నేలపై ఆణించి పట్టుకున్నాడు. అయితే ఈ దాడి ఓ భూమి విషయంలో జరిగినట్టు గా పోలీసులు గుర్తించారు. ఓ భూమి విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ భూమి తనదేనని మహిళ ఆరోపిస్తుండగా తమ భూమిని కబ్జా చేసిందంటూ అవతల వర్గం వాళ్లు ఆరోపిస్తున్నారు. ఇక నవంబర్ 13న ఈ ఘటన జరగ్గా,…వీడియో వైరల్ అయిన తర్వాతే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీపక్ భార్గవ మాట్లాడుతూ….ఇప్పటికే మహిళపై దాడికి సంబంధించి కేసు నమోదు చేశామని చెప్పారు.
Advertisement
Advertisement
ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఈ ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. మహిళల భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యిందని బీజేపీ రాజస్థాన్ సోషల్ మీడియా విభాగం ఆరోపించింది. ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ ‘లడ్కీ హూన్ లడ్ శక్తి హూన్’ నినాదంతో ప్రజలను మోసం చేస్తుంటే….. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో ఈ రోజు పట్టపగలు ఏమాత్రం భయపడని పోకిరీల గుంపు ఒంటరి మహిళపై భౌతిక దాడి చేసింది. చట్టాలు ఎక్కవ ఉన్నాయ్….అంటూ బీజేపీ నాయకురాలు ప్రీతి గాంధీ ప్రశ్నించింది.