ఇక్కడ ఫోటో జయసుధను పట్టుకొని కనిపిస్తున్న డైరెక్టర్ కె. రాఘవేంద్ర రావు… ఒక సీన్ ను హీరోకు వివరిస్తూ యాక్టింగ్ ను చేసి చూపిస్తున్నప్పుడు క్లిక్ మనిపించిన ఫోటో ఇది. జయసుధ కెరీర్ ను నిలబెట్టిన వారిలో ఒకరు దాసరి నారాయణరావు అయితే మరొకరు రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావు గారి 25 సినిమాల్లో జయసుధ హీరోయిన్ గా నటించింది.
Advertisement
ఇక ఈ సీన్ విషయానికొస్తే…ఇది జ్యోతి సినిమాలోని సీన్! 1976లో మురళీ మోహన్, జయసుధలు హీరోహీరోయిన్స్ గా రాఘవేంద్రరావు డైరెక్షన్ లో రిలీజైన చిత్రం….ఈ చిత్రం మంచి హిట్ ను సాధించింది. మురళీ మోహన్, జయసుధల మధ్య వచ్చే రొమాన్స్ సీన్లలో యాక్టింగ్ ను దర్శకుడు చూపిస్తున్న క్రమంలోనిది ఈ ఫోటో!
Advertisement
ఈ సినిమా కథ :
ఎప్పుడూ సరదాగా ఉండే జ్యోతి (జయసుధ), రవి (మురళీమోహన్) ని ప్రేమిస్తుంది. అనుకోని పరిస్థితుల వల్ల తన తండ్రి వయసున్న రాజయ్య (గుమ్మడి)ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. తాను కాలిపోతూ అందరికీ వెలుగునివ్వడం జ్యోతి లక్షణం కాబట్టి ఈ సినిమాకు జ్యోతి అనే టైటిల్ ను పెట్టారు. ఇది మమతల కోవెల అనే నవల ఆధారంగా తీయబడ్డ సినిమా. ఈ సినిమాలోని నటనకు గాను జయసుధకు నంది అవార్డ్ లభించింది.