సినిమాల్లో వినోదం ఉండాలంటే కమెడిన్ లు ఉండాల్సిందే. కథ బలంగా లేకపోయినా కామెడీతో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలెన్నో ఉన్నాయి. అందువల్లే కమెడిన్లకు సినీపరిశ్రమలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇక ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో కమెడియన్ లెజెండరీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంటారు. అలా మన తెలుగులో లెజెండరీ కమెడియన్ గా బ్రహ్మానందం ఎదిగారు.కాగా తమిళంలో వడివేలు లెజండరీ కమెడియన్ స్థాయికి ఎదిగారు. అయితే బ్రహ్మానందం కెరీర్ ఎప్పుడూ డౌన్ ఫాల్ అవ్వలేదు కానీ వడివేలు చేసిన చిన్న తప్పుకు ఒక్కసారిగా ఆయన కెరీర్ దారుణంగా మారిపోయింది ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి..? కెరీర్ ఎందుకు డౌన్ ఫాల్ అయ్యింది అన్నది ఇప్పుడు చూద్దాం….సుంధర్ సి దర్శకత్వంలో వచ్చిన విన్నర్ సినిమా తరవాత వడివేలు తెరపై కనిపించలేదు.
Advertisement
దానికి కారణం వడివేలు చేసిన తప్పు ఒకటైతే అసలు కారణం మాత్రం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత. తమిళనాట అమ్మగా పిలిచే జయలలిత ఎంత మంచిదో నచ్చకపోతే అంతే కఠినంగా నిర్ణయాలు తీసుకుంటుందట. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే వడివేలు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. అంతే కాకుండా 2011 ఎన్నికలకు ముందు వడివేలుకు విజయ్ కాంత్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే విజయ్ కాంత్ 2011 ఎన్నికల్లో గెలిచేది విజయ్ కాంత్..ప్రజలకు మంచి చేసేది కూడా విజయ్ కాంత్ అనే డైలాగ్ చెప్పాలని వడివేలుకు ఆర్డర్ వేశాడట. కానీ వడివేలు దానికి ససేమీరా అనడంతో విజయ్ కాంత్ ఏకంగా వడివేలు కాలర్ పట్టుకున్నాడట.
Advertisement
also read : మగాళ్ల బుద్దిని తిడుడూ పాట…సమంతకు పాలాభిషేకం..!
దాంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇక ఆ తరావత 2011 ఎన్నికలు వచ్చాయి. విజయ్ కాంత్ ఎన్నికల్లో ఎండీఎంకే నుండి రంగంలోకి దిగారు. ఇక వడివేలు అదే సమయంలో డీఎంకే తరపున ప్రచారానికి దిగి తనకు జరిగిన అవమానం పై విజయ్ కాంత్ ను ఏకిపారేశారు. కామెడి పంచులతో విజయ్ కాంత్ పరువు తీశాడు. అదే ఊపులో ఎండీఎంకే తో పొత్తుపెట్టుకున్న జయలలితపై కూడా సెటైర్లు వేస్తూ ఆమె గాలితీశాడు. కానీ వడివేలు ప్రచారం చేసిన ప్రతి చోటా డీఎంకే చిత్తయ్యింది. కానీ జయలలితకు మూడు వందలకు పైగా సీట్లను గెలుచుకుంది.
అమ్మ అధికారంలోకి రాగానే వడివేలును సినిమాల్లోకి తీసుకోకూడదని నిర్మాతలకు హెచ్చరికలు జారీ చేసింది. దాంతో అప్పటికే వడివేలు నటించిన సిమాలను నిలిపివేసి సీన్లను కత్తిరించారు. అలా అమ్మ అధికారంలోకి రావడంతో వడివేలు ఇంటికే పరిమితం అయ్యాడు. అలా పదిఏళ్లు వడివేలు ఇంటికే పరిమితం అయ్యాడు. ఇక జయలలిత చనిపోయిన తరవాత విజయ్ హీరోగా నటిచింన మెర్సల్ సినిమాతో మళ్లీ తెరపైకి వచ్చాడు. ఇప్పుడు డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఇప్పటి నుండి వడివేలు కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.