ఇండియాలో జరగబోతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు జరగనుంది. 19 సంవత్సరాల తర్వాత ఇండియాలో ఈ టోర్నమెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ గ్రౌండ్స్ లో ఈ మ్యాచ్లు నిర్వహించేలా ఐసీసీ ప్లాన్ చేసింది.
Advertisement
అయితే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసిన తరుణంలో… టీమిండియా కు అదిరిపోయే శుభవార్త అందింది. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రియంట్రి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. గత కొన్ని రోజులుగా వెన్ను నొప్పితో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం కోరుకున్నట్లు తెలుస్తోంది. జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ సెంటర్లో రికవరీ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.
Advertisement
అయితే తాజాగా కోలుకున్న జస్ప్రీత్ బుమ్రా… ఇవాళ ఏడు ఓవర్లు వేశాడట. ఉదయం నుంచి సాయంత్రం వరకు 7 ఓవర్ల కోటాను పూర్తి చేశాడట జస్ప్రీత్ బుమ్రా. ఇక ఈ లెక్కన జస్ప్రీత్ బుమ్రా కోలుకున్నట్లేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలో ఐర్లాండ్ తో జరగనున్న టి20 సిరీస్ కు… జస్ప్రీత్ బుమ్రా సిద్ధం అవుతాడని చెబుతున్నారు. తదనంతరం… ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ 2023 లో కూడా.. జస్ప్రీత్ బుమ్రా ఆడతాడని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా మొన్న జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ లో జస్ప్రీత్ బుమ్రా లేటి లోటు కచ్చితంగా కనిపించింది.
ఇవి కూడా చదవండి
2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..
వరల్డ్ కప్ కోసం BCCI ధోనితో కలిసి ఇలాంటి ప్లాన్ వేసిందా ? మాములుగా లేదుగా !
Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు