Home » Janhvi Kapoor : హైదరాబాద్ లో ఖరీదైన ఫ్లాట్ కొన్న జాన్వీ..ఎన్ని కోట్లో తెలుసా ?

Janhvi Kapoor : హైదరాబాద్ లో ఖరీదైన ఫ్లాట్ కొన్న జాన్వీ..ఎన్ని కోట్లో తెలుసా ?

by Bunty
Ad

జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక హిందీలో ఎన్నో సినిమాలలో నటించింది. గ్లామర్ వలకబోస్తూ ఎన్నో ఫోటోషూట్లు కూడా చేసేది. కానీ ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్స్ మాత్రం రాలేదు. ఆఫర్స్ వచ్చినప్పటికీ తాను నటించిన సినిమాలేవి పెద్దగా గుర్తింపును సాధించలేకపోయాయి. ఇక ఈ భామ తెలుగులో నటిస్తున్న చిత్రం ‘దేవర’.

Janhvi Kapoor wants to bought a luxurious duplex

Janhvi Kapoor wants to bought a luxurious duplex

ఎన్టీఆర్ సరసన ఈ అమ్మడు జతకట్టే ఛాన్స్ ను కొట్టేసింది. ఈ సినిమా కనక హిట్ అయితే జాన్వీ కపూర్ కు తెలుగులో చాలా అవకాశాలు వస్తాయని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయినప్పటికీ ఇందులో జాన్వికపూర్ నటించింది చాలా తక్కువేనట. ఎక్కువగా హీరో సీన్స్ మాత్రమే తీశారట. దసరా అనంతరం జాన్వీ కపూర్, ఎన్టీఆర్ మధ్య సీన్స్, సాంగ్స్ ని తీయనున్నారట. ఇక నాన్ స్టాప్ షెడ్యూల్ తో ఫుల్ బిజీగా ఉండడం వల్ల జాన్వికపూర్ హైదరాబాదులో ఉండాలని అనుకుంటున్నారట.

Advertisement

Advertisement

ఈ మేరకు హైదరాబాద్‌ లోని మణికొండలో పెద్ద అపార్ట్‌ మెంట్‌ కొనుగోలు చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట జాన్వీ కపూర్‌. ఎన్ని కోట్ల అయినా సరే..కొనాల్సిందేనని మొండి పట్టు పట్టిందట జాన్వీ. ఇక తన తల్లి మాదిరిగానే జాన్వి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకోవాలని ఆరాటపడుతోంది. తనకు తెలుగులో నటించాలని చాలా ఆసక్తి ఉండేదట. శ్రీదేవి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈ క్రమంలోనే తన తల్లిని రోల్ మోడల్ గా తీసుకొని జాన్వి కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించాలనుకుంటుందట.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading