Home » నరేష్ కు తెలుగు నేర్పించడానికి జంద్యాల అంతలా కష్టపడ్డారా…?

నరేష్ కు తెలుగు నేర్పించడానికి జంద్యాల అంతలా కష్టపడ్డారా…?

by AJAY
Ad

జంధ్యాల ఈ పేరు ఈ తరం వారికి తెలియకపోవచ్చు కానీ 80s, 90s ప్రేక్షకులకు ఈయన ఒక స్టార్ డైరెక్టర్. జంధ్యాల హాస్య ప్రియులను కడుపుబ్బా నవ్వించే సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ గా రాణించారు. అంతేకాకుండా ఇప్పుడు జబర్దస్త్ ఇతర టీవీ షోలలో కనిపించేలాంటి కామెడీ కాకుండా ఆరోగ్యకరమైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు.

Advertisement

ఆయన కెరీర్ లో 300 సినిమాలకు రచయితగా పనిచేయడంతో పాటు 50 సినిమాలకు దర్శకత్వం వహించారు. కాగా తాజాగా జంధ్యాల భార్య అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కొత్తవారితో సినిమాలు చేయాలని జంద్యాల ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. నాటకాలలో నటించే వారిని చూసి వారికి ఆఫర్ లు ఇచ్చే వారని చెప్పారు.

Advertisement

అంతేకాకుండా జంద్యాల ఎక్కువగా నరేష్ తో సినిమాలు చేయడం గురించి అన్నపూర్ణమ్మ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నరేష్ చెన్నై లో పుట్టి అక్కడే పెరగడం వల్ల ఆయనకు తెలుగు మాట్లాడటం చదవడం వచ్చేది కాదని చెప్పారు. దాంతో జంధ్యాల గారు తెలుగు అక్షరాలు నేర్పించి వాటిని ఎలా పలకాలో కూడా నేర్పించారని అన్నారు. అంతేకాకుండా నరేష్ తెలుగు సరిగ్గా పలకకపోవడంతో జంధ్యాల ఎస్పీ బాలు తో డబ్బింగ్ చెప్పించాలని నిర్ణయించుకున్నారట. కానీ విజయనిర్మల మాత్రం నరేష్ తోనే డబ్బింగ్ చెప్పించాలని అన్నారట.

దాంతో జంధ్యాల… మొదటి సినిమాకు నరేష్ డబ్బింగ్ చెబితే ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం… కానీ బాలు గారితో డబ్బింగ్ చెప్పిస్తే నరేష్ భవిష్యత్తు బాగుంటుందని సలహా ఇచ్చారట. దాంతో విజయనిర్మల సైతం ఒప్పుకున్నారట. ఇక ఆ తర్వాత సినిమాలకు నరేష్ సొంతంగా డబ్బింగ్ నేర్చుకుని చెప్పడంతో పాటు టాలీవుడ్ లో నటుడు గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

Visitors Are Also Reading