పేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలోని 30 లక్షల మందికి పైగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుగా 1977 భూముల చట్టాన్ని సవరించింది. ఆర్డినెన్స్ ని మేరకు జారీ చేసింది. పేదల ఇళ్ల స్థలాలని రిజిస్ట్రేషన్ చేసి ఒక ఆస్తిగా అప్పగించేందుకు చట్ట సవరణ చేసింది ప్రభుత్వం. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 30.65 లక్షల ఇళ్ల స్థలాలని ప్రభుత్వం ఇచ్చింది. పేదలకి ఒక ఆస్తి లాగా ఆ స్థలాల మీద బ్యాంకులు ఆర్థిక సంస్థల నుండి లోన్ పొందే విధంగా అవకాశాన్ని ఇవ్వడానికి ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.
Advertisement
Advertisement
వాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి కన్వీనియన్స్ డీడ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం భూముల చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లపట్టాలకి రిజిస్ట్రేషన్ చేసి అప్పగించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయడానికి గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే విఆర్ఓ లని ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. ప్రభుత్వం శనివారం జీవో నెంబర్ 36ని జారీ చేసింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!