సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న నటులలో చంద్రమోహన్ ఒకరు. ఈయన హీరోగా నటించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చంద్రమోహన్ దాదాపు 170కి పైగా చిత్రాల్లో హీరోగా నటించి…. ఆ తర్వాత సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తండ్రి, తాత వంటి పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా ఎదిగారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్న సమయంలో ఒక చిన్న గొడవ వల్ల హీరోగా అవకాశాలు తగ్గిపోయాయట. వివరాల్లోకి వెళితే…. చంద్రమోహన్ హీరోగా నటిస్తున్న సమయంలో చాలామంది హీరోయిన్లకు మంచి లైఫ్ ని ఇచ్చారట. ఒక్కసారి తన పక్కన హీరోయిన్గా నటిస్తే టాప్ పొజిషన్ కి వెళ్తారు అనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది.
Advertisement
దాదాపు చంద్రమోహన్ 45 మంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వారందరూ కూడా చాలావరకు స్టార్ హీరోయిన్లుగా కొనసాగారు. ఇక చంద్రమోహన్, ఎన్టీఆర్ మధ్య ఒక చిన్న గొడవ జరగడం వల్లే చంద్రమోహన్ కి హీరోగా అవకాశాలు తగ్గిపోయాయని ఇండస్ట్రీవర్గాల్లో ఓ వార్త వైరల్ అవుతుంది. సీనియర్ ఎన్టీఆర్ ‘అన్నదమ్ముల’ అనుబంధం అనే సినిమాను చేయాలని అనుకున్నారట. ఆ సినిమాలో బాలకృష్ణ చేసిన క్యారెక్టర్ లో చంద్రమోహన్ ని ముందుగా అనుకున్నారట. ఆ పాత్ర గురించి చంద్రమోహన్ కి చెప్పడంతో అతను కూడా ఓకే చెప్పారట. దీంతో చంద్రమోహన్ ఆ పాత్ర కోసం తన బాడీని ఫిట్ గా చేసుకొని, నెల రోజులపాటు డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేశారట. ఇక అనుకున్న రోజు ప్రకారం షూటింగ్ లొకేషన్ కి చంద్రమోహన్ వెళ్లారట. తాను వెళ్లేలోపే ఆ పాత్రలో బాలకృష్ణను పెట్టి సినిమా తీస్తున్నారట.
Advertisement
ఇక కోపంతో రగిలిపోయిన చంద్రమోహన్ విషయాన్ని తెలుసుకొని ఇంటికి వెళ్ళిపోయారట. ఇక ఎన్టీఆర్ వెంటనే తన మేనేజర్ నీ చంద్రమోహన్ వద్దకు పంపించి ఎన్టీఆర్ నీకు వేరే సినిమాలో హీరోగా అవకాశం ఇస్తాడు అని చెప్పి పంపించారట. ఆ విషయం మేనేజర్ చంద్రమోహన్ కి చెప్పగానే అతను ఇచ్చే అవకాశం ఎవడికి కావాలి… అతనికి కనీస బాధ్యత లేకుండా నాకు చెప్పిన క్యారెక్టర్ ని వేరే వాళ్ళకి ఎలా ఇస్తాడు అని కాస్త కోపంగా మాట్లాడి రచ్చ రచ్చ చేశాడట. ఇక ఆ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ కాస్త బాధపడ్డారట. ఇక ఆ గొడవ జరిగినప్పటి నుంచి చంద్రమోహన్ కి హీరోగా అవకాశాలు రాలేదట. ఇక ఈ గొడవ కారణంగానే చంద్రమోహన్ కెరియర్ ఇలా అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!