పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మామూలుగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలు ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో విపరీతంగా ఎదురు చూస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలతో ఇంకోపక్క రాజకీయాలతో కూడా బిజీగా ఉంటున్నారు. జనసేన పార్టీని ఏర్పాటు చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయబోతున్నారు. బీజేపీని కూడా కలుపుకొని అధికార వైసీపీని ఓడించాలని లక్ష్యంలో ఉన్నారు. పవన్ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు కార్యకర్తలకి దగ్గర అవ్వడానికి ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి వారాహి యాత్ర ని కూడా స్టార్ట్ చేశారు యాత్రకి ఊహించని రీతిలో స్పందన వస్తోంది.
Advertisement
Advertisement
విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గతంలోని చెప్పిన విషయాలను గుర్తు చేసుకున్నారు. సుస్వాగతం సినిమా చేసేటప్పుడు జగదాంబ సెంటర్లో బస్సు పై డాన్స్ వేశారట అప్పుడు నలుగురిలో అలా డాన్స్ చేసినందుకు సిగ్గు వేసిందని, వెంటనే తన వదినకి ఫోన్ చేసి తనని సినిమాల్లోకెందుకు పంపించారని అడిగారట. ఇదే తన ఆఖరి సినిమా అని చెప్పేసానని ఇక సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారట.
ఈ మాటల్ని కొందరు ప్రస్తుత రాజకీయాల కోసం చేస్తున్న సినిమాలని ఆపేసారని షూటింగ్ దశలో ఉన్న హరహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలే చివరి సినిమాలని చెప్పడం మొదలుపెట్టారు. నిజానికి పవన్ సుస్వాగతం సినిమా టైంలో జరిగిన సంఘటన ఇది. వారాహి యాత్రలో భాగంగా చెప్పారు కానీ కొంతమంది మాత్రం ఇప్పుడు నటించే ఈ సినిమాలు ఆఖరి సినిమాలని ప్రచారం మొదలుపెట్టారు కానీ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలు గురించి చెప్పలేదు. అప్పటి సుస్వాగతం టైం లో అదే ఆఖరి సినిమా అని అన్నారు అంతే.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!