ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమలో పడితే అదో కొత్త ప్రపంచంలో విహరిస్తారని అంటుంటారు.. ఈ ప్రేమలో ఏ మత్తు ఉందో తెలియదు కానీ ఇందులో చిక్కుకుంటే మాత్రం కులం, మతం, ప్రాంతం అనే తేడా తెలియదు.. అందుకే మనం రకరకాల ప్రేమ కథలు చూస్తూ ఉంటాం..
Advertisement
ఇందులో ముఖ్యంగా సినీ సెలబ్రిటీల ప్రేమ వివాహాల విషయానికి వస్తే కొంతమంది హీరోలు వారి కంటే పెద్దవారైనా హీరోయిన్లను పెళ్లి చేసుకున్నారు. మరి కొంతమంది వారి కంటే చాలా చిన్నవారైనా హీరోయిన్లను పెళ్లి చేసుకున్నారు.. మరి వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
తమిళ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ జంటగా పేరుపొందిన సూర్య జ్యోతిక ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోని వీరి మధ్య ప్రేమ పుట్టి వివాహానికి దారితీసింది. సూర్య కంటే జ్యోతిక మూడు సంవత్సరాలు చిన్నది. ఇక తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరు పొందిన నాగచైతన్య సమంత జంట ప్రేమించి వివాహం చేసుకున్న ఎక్కువ కాలం నిలువలేక పోయారు. అయితే నాగచైతన్య సమంత కంటే ఏడాది పెద్దవాడు.
Advertisement
ఇక హీరో వరుణ్ సందేశ్ వితిక జంట విషయానికి వస్తే వీరిద్దరు కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారు. వితికా వరుణ్ కంటే మూడు సంవత్సరాలు పెద్దది. ఇక నాగార్జున అమల కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారు. రామానాయుడు కూతురు లక్ష్మికి విడాకులు ఇచ్చిన తర్వాత నాగార్జున అమలను వివాహమాడారు. నాగార్జున కంటే అమల ఎనిమిది సంవత్సరాలు చిన్నది. ఇక రామ్ చరణ్ ఉపాసన జంట కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఉపాసన రాంచరణ్ కంటే ఐదు సంవత్సరాలు చిన్నది. ఇక ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి పెద్దలు కుదిరిచిన వివాహమే కానీ ఎన్టీఆర్ కంటే లక్ష్మీ ప్రణతి 8 ఏళ్లు చిన్నది.
also read: