దేశంలో అప్పులు పెరుగుతున్నాయనే ఆందోళన ఉంది. మన దేశంలో ఆదాయం తగ్గడమే కాకుండా కరోనా ప్రభావం అన్ని రంగాల మీద ఎక్కువగా పడుతున్న నేపధ్యంలో అప్పులు పెరుగుతున్నాయి. దీని నుంచి బయటకు రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయనే మాట వాస్తవం. ఇక చాలా మందికి ఉండే అనుమానం… కరెన్సీ ఎక్కువగా ముద్రించి అప్పులు తీర్చడం సాధ్యమా…?
Advertisement
కచ్చితంగా అది సాధ్యమయ్యే పని కాదు. దేశంలో కరెన్సీనోట్ల ముద్రణకు విధివిధానాలు ఉంటాయి అనేది చాలా సందర్భాల్లో తెలుసుకున్నారు. అప్పుడు మాత్రమే దానికి విదేశాలతో ఎగుమతి దిగుమతుల్లో వ్యవహారాలకు తగిన విలువ దొరుకుతుంది. భారత ప్రభుత్వం గాని రిజర్వు బ్యాంకుకి మాత్రమే వారి విధివిధానాలను అనుసరించి 10,000 నోటు వరకు ముద్రించే అధికారాలు ఉంటాయి.
Advertisement
వారు నిరంతరం దేశంలోని నగదు చలామణి లావాదేవీలు, దేశంలో ఎకానమీ, బ్యాంకుల పనితీరును సమీక్షించి దేశంలోని కొత్తగా అయిన ఉత్పత్తులు, విలువ భరిత సేవల వంటివి కలిపి లెఖ్కగట్టి జాతీయ స్థూల ఆదాయంలో 2 – 3% వరకు మాత్రమే కరెన్సీ ముద్రించే అవకాశం ఉంది. ఏ దేశంలో అయినా సరే ప్రభుత్వాలు నోట్లు ముద్రించి ప్రజల్లోకి వదిలే పద్ధతి అమలు చేస్తే మాత్రం అంతర్జాతీయంగా ఆ దేశ కరెన్సీకి విలువ ఉండదు. కాబట్టి ఎక్కువ కరెన్సీ ముద్రించి అప్పులు చెల్లిస్తే… అప్పుల విలువ ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి.