మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ ఫ్యామిలీ నుండి అంత మంది హీరోలు వచ్చారంటే దానికి కారణం చిరంజీవి పడిన కష్టమే. కెరీర్ ప్రారంభంలో చిరు సైడ్ పాత్రలు చేస్తుండేవారు. ఆ తరవాత ఆయన టాలెంట్ చూసి హీరోగా అవకాశాలు ఇచ్చారు. దాంతో చిరు హీరోగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.
Advertisement
ఇక ఇండస్ట్రీలో హీరోగా ఎదుగుతున్న క్రమంలో అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను చిరు వివాహం చేసుకున్నాడు. అల్లు రామలింగయ్య గారే తన కుమార్తెను వివాహం చేసుకోవాలని చిరంజీవి గురించి ఆరాతీసి వివాహం జరిపించారు. అయితే ఇండస్ట్రీలో చిరంజీవి టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదగడానికి కారణం అల్లు రామలింగయ్యే అని ఆయనకు ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడితోనే మెగాస్టార్ ఈ రేంజ్ కు ఎదిగారని కొందరు వాదిస్తుంటారు.
Advertisement
కానీ 1980 లో చిరంజీవి సురేఖల వివాహం జరిగింది. అయితే అప్పటికే చిరంజీవి పదికి పైగా సినిమాల్లో నటించాడు. ఒకే ఏడాది చిరు పద్నాలుగు సినిమాలు చేసిన రికార్డు కూడా ఉంది. పద్నాలుగు సినిమాలు ఒకే ఏడాది చేశాడంటే ఎంతకష్టపడ్డాడు రోజుకు ఎన్నిగంటలు షూటింగ్ లో గడిపాడు అన్నది అర్థం చేసుకోవచ్చు. ఇక అల్లు రామలింగయ్య కు కూడా కుమారుడు అల్లు అరవింద్ ఉన్నారు. కానీ అల్లు అరవింద్ నటుడిగా ఏ మేరకు రానించారు.
అంతెందుకు ఇండస్ట్రీకే పెద్ద అయిన దాసరి నారాయణ రావుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆయన తలుచుకుంటే ఏ డైరెక్టర్ అయినా వాళ్లతో సినిమా చేస్తాడు. కానీ వాళ్లు ఎంతవరకు సక్సెస్ అయ్యారు. కాబట్టి చిరంజీవి సక్సెస్ ఆయనకు టాలెంట్ తోనే వచ్చిందని చెప్పుకోవాలి. ఇండస్ట్రీలో ఎదగాలన్న కసి పట్టుదల నేడు ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టాయి. కానీ అల్లు అరవింద్ చిరుతో సినిమాలు చేయడం ఆయను కొంత ఉపయోగపడింది. నిర్మాతగా అల్లు అరవింద్ సక్సెస్ అవ్వడానికి కూడా చిరుతో సినిమాలు చేయడం ఉపయోగపడింది.
ALSO READ :
“ఫిదా” సినిమాలో ఈ మిస్టేక్ ను గమించారా..? శేకర్ కమ్ముల ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు సార్..!