మెగాస్టార్ చిరంజీవి అంటే టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. ఆయన్ను ఆదర్శంగా తీసుకునే చాలామంది సినిమాల్లోకి వచ్చారు. సాధారణ కానిస్టేబుల్ కుమారుడు గా సినిమాల్లోకి ఎంట్రీ స్టార్ హీరోగా ఎదగటం తో ఆయన అంటే చాలామంది గౌరవిస్తారు. అయితే ఆ సక్సెస్ చిరంజీవికి ఊరికే రాలేదు. దానికోసం ఆయన ఎంతో కష్టపడేవారు.
Advertisement
ఇక అలా కష్టపడుతున్న క్రమంలో చిరు సరిగా రాత్రుళ్ళు పడుకునే వారు కూడా కాదట. దాంతో షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికినా ఒక కునుకు తీసేవారట. అలా చిరంజీవి ఓ సినిమా షూటింగ్ మధ్యలో నిద్రపోగా ఆశక్తికర ఘటన చోటు చేసుకుంది. చిరంజీవి హీరోగా కే విశ్వనాథ్ డైరెక్టర్ గా వచ్చిన స్వయం కృషి సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
Advertisement
అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో విశ్వనాథ్ గారు భోజనం చేస్తూ ఉంటే చిరంజీవి మాత్రం పడుకున్నారట. దాంతో చిరంజీవి భోజనం చేశారా లేదా అని విశ్వనాథ్ గారు సిబ్బందిని అడిగారు. దాంతో ఆ సిబ్బంది ఆయన. మధ్యాహ్నం భోజనం చేయరని డైట్ లో ఉన్నారని చెప్పారు. దాంతో కే. విశ్వనాథ్ స్వయంగా ప్లేట్ లో అన్నం వేసి అందులో పెరుగు వేసి తానే కలిపి చిరంజీవికి ఇవ్వండని పంపించారు.
కానీ ఆ సిబ్బంది నిద్రలో ఉన్న చిరు ను లేపెందుకు భయపడిపోయారు. కానీ అదే సమయంలో అక్కడ గుడి గంట మోగింది. దాంతో. ఆ శబ్దానికి చిరు లేచి కూర్చున్నారు. ఇక అప్పుడే విశ్వనాథ్ గారు చిరంజీవి అన్నం తిను అని చెప్పడం తో మహా ప్రసాదం అని తిన్నారు. ఈ విషయాన్ని చిరు చాలా ఇంటర్వ్యూ లలో చెప్పి సంతోషం వ్యక్తం చేశారు.