నందమూరి తారకరామారావు చిన్న కూతురు ఉమామహేశ్వరి సోమవారం అనారోగ్య కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఉమామహేశ్వరి బంజారాహిల్స్ లోని తమ నివాసంలోనే ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో నందమూరి ఫ్యామిలో విషాద చాయలు అలుముకున్నారు. బాలకృష్ణతో పాటూ చంద్రబాబు ఇతర కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Advertisement
జూనియర్ ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజు ఉమామహేశ్వరి గారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిజానికి ఉమామహేశ్వరి గురించి ఆమె చనిపోకముందు పెద్దగా ఎవరికీ తెలియదు. ఫ్యామిలీలో రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉన్నా కూడా ఆవిడ రాజకీయాల్లో అడుగుపెట్టలేదు.
Advertisement
కానీ ఆత్మహత్య చేసుకున్న తరవాత ఉమామహేశ్వరి గురించి ఎక్కువగా ఆరా తీస్తున్నారు. ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు గానీ ఒకప్పుడు మాత్రం ఆమె ఎంతో ధైర్యంగా ఉండేవారట. ఎన్టీఆర్ కు సంబంధించిన విషయాలను కూడా ఆమె మ్యానేజ్ చేశారట. ఎన్టీఆర్ ఆ రోజు ఎవరిని కలవాలి. ఆ రోపు ప్రోగ్రాం లు ఏంటి ఇలా ప్రతి ఒక్కిటి దగ్గరుండి చూసుకున్నారట. పెళ్లి తరవాత ఎన్టీఆర్ ఉమామహేశ్వరికి ఓ ఇంటిని కొనిచ్చారు.
అయితే ఎన్టీఆర్ సతీమణి చనిపోయిన తరవాత అదే ఇంట్లో ఉండిపోయారట. అంతే కాకుండా ఆ ఇంట్లో తన తండ్రి చనిపోయిన తరవాత లక్ష్మి పార్వతి ఉన్నా కూడా ఉమామహేశ్వరి ఏమీ అనలేదట. మిగితా కుటుంబ సభ్యులు అంతా లక్ష్మి పార్వతిని ఆ ఇంటిని కాళీ చేయాలని చెబితే ఉమామహేశ్వరి మాత్రం తన తండ్రికి నచ్చిన వ్యక్తి కాబట్టి ఆ ఇంట్లో ఉండవచ్చని వాదించారట. కుటుంబ సభ్యులు ఒత్తిడి తీసుకువచ్చినా ఉమామహేశ్వరి వినలేదట. తండ్రి లాగే ఉమామహేశ్వరి పట్టుదల, ధైర్యం కలిగిన వ్యక్తి అని సన్నిహితులు చెబుతున్నారు.