అక్కినేని నటవారసుడుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఏఎన్ఆర్ అప్పట్లో లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకోగా నాగార్జున ఆయన జనరేషన్ లోఅమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు. నాగార్జునకు ఫ్యామిలీ మరియు లేడీ ఫాలోయింగ్ ను తీసుకువచ్చిన సినిమా నిన్నేపెళ్లాడతా. ఈ సినిమాలో టబు హీరోయిన్ గా నటించింది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తరవాత నాగార్జున క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఈ సినిమా టీవీలో వస్తే ఇప్పటికీ మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఈ సూపర్ హిట్ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించడంతో పాటూ నిర్మాతగా కూడా వ్యవహరించారు.
Advertisement
Advertisement
అయితే ఈ సినిమా విషయంలో ఆసక్తికర ఘటన చోటు చేసకుందని కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతా సిద్దం చేసిన తరవాత నాగార్జున పిలిచి క్లైమాక్స్ ఎలా తీస్తావో చెప్పు అని కృష్ణవంశీని అడిగారట.
కృష్ణవంశీ చెప్పిన తరవాత క్లైమాక్స్ లో మార్పులు చేయాలని సూచించాడట. సినిమా మొత్తం లైటర్ వే లో ఉందని కాబట్టి సీరియస్ క్లైమాక్స్ గా తీస్తే బాగుంటందని చెప్పారట. దాంతో కృష్ణవంశీ ఆ రోజు రాత్రి కూర్చుని మళ్లీ క్లైమాక్స్ రాసుకున్నారు. ఇక ఆ సినిమాకు క్లైమాక్స్ కీలకం గా మారడంతో పాటూ సినిమా హిట్ అవ్వడానికి కారణం అయ్యింది. దాంతో కృష్ణ వంశీ కూడా నాగార్జున చెప్పిన మాట విన్నందుకు సంతోషపడ్డారట.
also read : హీరో సుమంత్ తో మంచు లక్ష్మి… డార్లింగ్ అంటూ పోస్ట్!