సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అలా ఇద్దరిని పెళ్లి చేసుకున్నవారిలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. కృష్ణ తన మేనమామ కూతురు అయిన ఇందిరాదేవిని మొదటగా వివాహం చేసుకున్నారు. వీరికి రమేష్ బాబు, మహేశ్ బాబు మరియు కూతురు మంజుల జన్మించారు. అయితే కృష్ణ స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో ఆయన ఎక్కువగా హీరోయిన్ విజయనిర్మలతో సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.
Advertisement
వీరిద్దరి జంటను హిట్ పెయిర్ అని పిలిచేవారు. ఈ క్రమంలో విజయనిర్మలతో కృష్ణ ప్రేమలో పడ్డారు. అయితే అప్పటికే విజయనిర్మలకు కూడా పెళ్లి కాగా భర్తతో విడాకులు తీసుకుని ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. అంతే కాకుండా విజయనిర్మలకు నరేష్ జన్మించాడు. అయినప్పటికీ విజయనిర్మలను కృష్ణ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ఓ గుడిలో వివాహం చేసుకోగా భర్త నిర్నయాన్ని ఇందిరాదేవి సైతం గౌరవించారు.
Advertisement
అంతే కాకుండా ఇందిరాదేవి విజయనిర్మలతో ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగినప్పుడు కలిసి మాట్లేడేవారు కూడా. ఇక రెండో పెళ్లి చేసుకున్న తరవాత కృష్ణ రెండు కుటుంబాలను చూసుకునేవారు. కానీ సినిమా ఫంక్షన్ లు రాజకీయ సభలకు విజయనిర్మలతోనే ఎక్కువగా వెళ్లేవారు. ఇదిలా ఉంటే కృష్ణ తల్లి దండ్రులు తన మేనకోడలు కృష్ణ మొదటి భార్య అయిన ఇందిరాదేవి వద్ద కాకుండా విజయనిర్మల వద్ద ఉండేవారట. దానికి కారణం విజయనిర్మల ముందు నుండి వారిని ఎంతో ప్రేమగా చూసుకునేవారట.
అంతే కాకుండా తనతో పెళ్లికి అడ్డు చెప్పకపోవడంతో అత్తమామలు అంటే విజయనిర్మలకు కూడా చాలా ఇష్టమట. దాంతో కృష్ణ తల్లితండ్రులు గండిపేటలోని కృష్ణ విజయనిర్మల ఇంటిలోనే ఉండేవారట. విజయనిర్మల చేసే వంటలు అంటే కృష్ణ తల్లికి చాలా ఇష్టమట. చనిపోయేవారని తన అత్తామామలకు తానే వండిపెట్టానని పనివాళ్లు వంట చేస్తే వారికి నచ్చేదికాదని విజయనిర్మల గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.