మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఆయన మాటలు వినడానికి సినిమా హాల్ కు వెళ్ళే ప్రేక్షకులు ఉన్నారు. ఇక ఆయన సినిమాల్లో హీరో బ్యాగ్ తో కనపడుతూ ఉంటాడు. అసలు అలా ఎందుకు…? అసలు ఆయన సినిమాలు అన్నీ ఒకేలా ఉంటాయి అనే ఆరోపణ కూడా ఉంది. ఒకసారి ఆయన కొన్ని సినిమాలు చూస్తే…
Advertisement
అతడు
హీరో మహేష్ బాబు పట్నం నుంచి పల్లెటూరు వెళ్ళిపోతాడు. హీరో కమర్షియల్, క్లవర్ కిల్లర్. అలాంటి వ్యక్తి హత్య చేసి ఇంకో చోటకు వెళ్లి అజ్ఞాతవాసంలో ఉంటాడు.
జల్సా
హీరో పాత్రను నక్సలైట్ గా చూపించారు. చదువుకోడానికి హీరో బయటకు వచ్చేస్తాడు. జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి బయటకు వస్తాడు… కాబట్టి బ్యాగ్ తో వచ్చేస్తాడు.
ఖలేజా
ఈ సినిమాలో హీరో ట్యాక్సీ డ్రైవర్ గా కనిపించాడు. ఓ పని మీద రాజస్థాన్ వెళ్ళడం అక్కడ దేవుడు కావడం జరుగుతుంది. అంటే ఇక్కడ హీరో ఒక చోట నుంచి మరో చోటకి మారాడు.
Advertisement
అత్తారింటికి దారేది
ఈ సినిమాలో కోటేశ్వరుడైన హీరో అత్తను వెతుక్కుంటూ ఇండియాకు వెళ్లి… అత్త రావాలి అంటూ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో కూడా హీరో బ్యాగ్ ఎత్తే పరిస్థితి.
అఆ
పూర్తిగా హీరోయిన్ మీదనే ఈ సినిమా ఆధారపడి ఉన్నా సరే హీరో ఖాతాలో హిట్ చెప్తూ ఉంటారు. హైదరాబాదులో ఉండే హీరోయిన్ ఈస్ట్ గోదావరి జిల్లాలోని అత్తారింటికి రావడంతో ఆమె కూడా బ్యాగ్ సర్దాలి.
జులాయి
విశాఖలో ఉండే హీరో… భారీ దొంగతనం బయటపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోవడం సినిమాలో ఉంటుంది. మంచి చేసినా సరే హీరోని కాపాడటానికి హైదరాబాద్ పంపిస్తారు.
సన్నాఫ్ సత్యమూర్తి
ఈ సినిమాలో కూడా అంతే… ఒకటి డబ్బుల కోసం శ్రీవిష్ణు ప్రాజెక్ట్ ఒకే చేసి వేరే ఊరు వెళ్ళడం, ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఆస్తి కోసం తమిళనాడు వెళ్ళడం.
ఇలా అజ్ఞాతవాసి, అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల్లో కూడా హీరో ఒక చోట నుంచి మరో చోటకి వెళ్తూ ఉంటాడు.