Home » చరణ్‌- ప్రభాస్‌ ల మధ్య నలిగిపోతున్న సారా టెండూల్కర్‌ ?

చరణ్‌- ప్రభాస్‌ ల మధ్య నలిగిపోతున్న సారా టెండూల్కర్‌ ?

by Bunty
Ad

గత రెండు రోజుల క్రితం నుంచి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాకుండా సారా టెండూల్కర్, క్రికెటర్ శుబ్ మన్ గిల్ ప్రేమలో ఉన్నారంటూ అనేక వార్తలు వస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఈ విషయంపై సారా ఎప్పుడు స్పందించలేదు. ఈ క్రమంలోనే తాజాగా సారా…. ప్రభాస్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల వార్తలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతోంది.

Advertisement

అంతేకాకుండా సారా టెండూల్కర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరుగుతోంది. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో సారా హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా ఈ అమ్మడు రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాల్సిందే. ఈ క్రమంలోనే తాజాగా సారా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది.

Advertisement

Sara Tendulkar's Love For Prabhas

Sara Tendulkar’s Love For Prabhas

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రశాంత్ నీల్ తెరకేకిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 1వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాబోతోంది. ఇక సారా సోషల్ మీడియాలో అందరిలాగే తాను కూడా సలార్ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ సలార్ పోస్టర్ను పోస్ట్ చేసింది. అంతే ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. “సారా నువ్వు కూడా ప్రభాస్ ఫ్యానేనా” అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Visitors Are Also Reading