మనం ప్రతి రోజు వంటకాలలో కచ్చితంగా పసుపుని ఉపయోగిస్తాం. పసుపు లేకుండా దాదాపు ఏ కూరని మనం చేయలేము. మనం వేసేది చిటికెడు పసుపే అయినా, అది కూరకి లెక్కలేనంత రుచిని ఇస్తుంది. అయితే పసుపులో నల్ల పసుపు కూడా ఉంటుందని ఎంత మందికి తెలుసు? పసుపుకొమ్ముల్లో నల్ల పసుపు కొమ్ము మహిమాన్వితమైనది. ఈ కాలం మనుషుల్లో నల్ల పసుపు గురించి తెలిసిన వారు చాలా తక్కువ. కానీ, ప్రాచీన కాలం నుంచే నల్ల పసుపు ప్రాముఖ్యతని సంతరించుకుంది.
Advertisement
ఈ నల్ల పసుపు మాములు పసుపు కంటే పవర్ ఫుల్ గా ఉంటుందట. అటవీ శాఖ ప్రకారం.. ఇది అరుదైన పసుపు జాతికి చెందిన మొక్క. ఇది అంతరించిపోతున్న మొక్కల జాబితాలో ఉంది. నల్ల పసుపుని అమ్మడం, మొక్కలను పెంచడం, ఇళ్లల్లో పెంచడం కూడా నేరమే. ఈ నల్ల పసుపు మొక్కలని నేలకంఠ, నడకచోరా, కృష్ణకేతారా అని రకరకాల పేర్లతో పిలుస్తారు.
Advertisement
నల్లపసుపుని ఎక్కువగా వశీకరణం, తాంత్రిక పూజలలోను, డబ్బుని ఆకర్షించడం కోసం ఉపయోగిస్తారు. మధ్య ప్రదేశ్ ప్రాంతంలోని నర్మదా నదీ తీర ప్రాంతాల్లోనూ, నేపాల్ లో కొన్ని దేశాల్లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోని తూర్పు కనుమలలోనూ చాలా అరుదుగా నల్లపసుపు దొరుకుతుంది. నల్ల పసుపు కొమ్ము లోపలి భాగం ముదురు నీలం రంగులో ఉంటుంది. దీన్ని సౌందర్య సాధనాల్లో వాడతారు. గిరిజనులకు నల్ల పసుపుపై చాలా నమ్మకాలున్నాయి. దీనిని గుమ్మాలకు వేలాడతీసి కడితే దుష్టశక్తులు రావని నమ్ముతారు. నల్ల పసుపుకొమ్ముని శనివారం రోజు పూజ చేసుకొని బీరువాలో, గల్లా పెట్టలో పెడితే డబ్బు వస్తుందని నమ్ముతారు. ఈ మూలికకు అమితమైన శక్తీ ఉందని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతుంటారు. ఇది అరుదుగా దొరుకుతుండడంతో దీన్ని లక్షలు, కోట్ల ఖరీదులో కూడా అమ్ముతుంటారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్ కీలక అప్డేట్.. అభిమానులకు పండుగే..!
Allu Arjun: సినిమాల్లోకి రాకముందు అల్లు అర్జున్ ఆ పని చేసేవాడా? మొదటి సంపాదన ఎంతంటే?