ఇండియన్ రైల్వేలు ఆదాయం పెంచుకునే విధంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలకు కూడా పెద్ద ఎత్తున సౌకర్యాలు అందించే మార్గాల దిశగా వెళ్తుంది. భారతీయ రైల్వే త్వరలో వస్తువులను ఇంటికి డెలివరీ చేసే సేవను ప్రారంభించనుంది. ఇప్పటికే వ్యక్తిగత మరియు బల్క్ కస్టమర్ల కోసం డోర్-టు-డోర్ డెలివరీ సర్వీస్ కి సంబంధించి టెస్ట్ రన్‌లను నిర్వహించడం మొదలుపెట్టింది.
Advertisement
భారతీయ రైల్వేలు కొరియర్ కంపెనీలు మరియు ఇ-కామర్స్ వ్యాపారం మాదిరిగానే సేవలను ప్రారంభించాలని యోచిస్తోంది. దీని కోసం, ఇది ఒక యాప్‌ని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. వినియోగదారులు సరుకులను ట్రాక్ చేయడంలో సహాయపడే QR కోడ్‌తో రసీదులను అందించాలని యోచిస్తోంది. యాప్ లేదా వెబ్‌సైట్ లో డెలివరీ చేయడానికి అవసరమైన సమయాన్ని కూడా చూపిస్తారు.
Advertisement
విస్తరిస్తున్న లాజిస్టిక్స్ వ్యాపారంలో పట్టు సాధించేందుకు ఇండియన్ రైల్వేస్… ఇండియా పోస్ట్ సహా మరికొన్ని వ్యవస్థలను వాడుకునే ఆలోచనలో ఉంది. ఈ ఏడాది జూన్-జూలై నాటికి ఢిల్లీ-ఎన్‌సిఆర్ మరియు గుజరాత్‌లోని సనంద్ సెక్టార్‌లో అలాంటి మొదటి సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. ఇందుకోసం రైల్వే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ (డీఎఫ్‌సీసీ)ని అందుబాటులోకి తెచ్చింది.
భారతీయ రైల్వే తన కొన్ని రైల్వే జోన్‌లను మాడ్యూల్‌ను అభివృద్ధి చేయమని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ముంబైలో మరో టెస్ట్ రన్ ప్లాన్ చేస్తున్నారు. ఇది కాకుండా, సేవ యొక్క అంతర్గత ట్రయల్ కూడా DFCC ద్వారా ప్రారంభించబడింది. ఈ సేవలను వాడుకోవడానికి… ఇంటి దగ్గర నుంచే ఆర్డర్ తీసుకోవడం లేదా… వాళ్ళు కేటాయించిన పాయింట్ లో వెళ్లి కొరియర్ చేస్తే పార్సిల్ చేసే విధంగా ప్లాన్ చేస్తుంది.