ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంటులో టీమిండియా కప్ గెలిస్తే 100 కోట్లు పంపిణీ చేస్తామని… ఆస్ట్రో టాక్ సీఈఓ పునీత్ గుప్తా సంచలన ప్రకటన చేశారు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 తుది దశకు వచ్చిన సంగతి తెలిసిందే. రేపు ఈ టోర్నమెంట్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ రాష్ట్రంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇక ఈ ఫైనల్ కోసం ఇప్పటికే టీమిండియా మరియు ఆస్ట్రేలియా జట్లు.. అహ్మదాబాద్ స్టేడియానికి చేరుకున్నాయి. రేపటి మ్యాచ్ కోసం ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి ఇరు జట్లు. ఈ నేపథ్యంలో భారత్ వరల్డ్ కప్ గెలిస్తే తన యూజర్లకు వెయ్యికోట్ల రూపాయలు పంచుతానని ఆస్ట్రోటాక్ సీఈఓ పునీత్ గుప్తా సంచలన ప్రకటన చేశారు. ఆస్ట్రేలియాతో ఫైనల్లో టీమిండియా గెలవాలని తాను కోరుకున్నట్లు చెప్పారు.
Advertisement
Advertisement
2011లో మనం WC గెలిచినప్పుడు తాను కాలేజీలో చదువుతున్నానని, తన జీవితంలో అత్యంత ఆనంద క్షణాల్లో అదొకటని పునీత్ చెప్పుకొచ్చారు. ఈసారి కప్ గెలిస్తే నా కంపెనీ యూజర్లతో ఆనందాన్ని పంచుకోవాలనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. కాగా రేపటి మ్యాచ్ లో టాస్ మొదట గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఆస్ట్రేలియా టీం కంటే మన టీమిండియా కు చాలా అడ్వాంటేజ్ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.