Home » టాప్ 2లో టీమిండియా… ఆ ఒక్క సిరీస్ గెలిస్తే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి! ఈసారి ఆస్ట్రేలియాతో…

టాప్ 2లో టీమిండియా… ఆ ఒక్క సిరీస్ గెలిస్తే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి! ఈసారి ఆస్ట్రేలియాతో…

by Bunty
Ad

బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా మూడు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 145 పరుగుల లక్ష ఛేదనలో భారతజట్టు 74 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది. దాదాపు గెలుపు కష్టమనే అందరూ భావించారు. కష్టాల్లో ఉన్న జట్టును రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్ ఆదుకున్నారు.

Advertisement

దీంతో బంగ్లాదేశ్ తో  జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను 2-0 తో గెలుచుకోవడంతో భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. ఈ జాబితాలో 99 పాయింట్లు ఉన్న టీమిండియా 58.93%తో రెండో స్థానంలోకి దూసుకొచ్చింది. ఆస్ట్రేలియా 76.92 శాతంతో అగ్రస్థానంలో ఉంది. కానీ భారత జట్టుకు దక్షిణాఫ్రికా రూపంలో ముప్పు ఉంది. 72 పాయింట్లు ఉన్న దక్షిణాఫ్రికా 54.55%తో మూడో స్థానంలో ఉంది.

Advertisement

ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. దీంతోపాటు సొంత గడ్డపై వెస్టిండీస్ తో రెండు టెస్టులు కూడా దక్షిణాఫ్రికాను ఫైనల్ రేసులోకి తేవచ్చు. భారత్ కు స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ మిగిలింది. మొత్తానికి ఈ ఎనిమిది టెస్టులు తీసి ఫైనల్ బెర్త్ ను ఖాయం చేస్తాయి. టాప్ ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా కు ఏ డోకా లేకపోయినా, రెండో స్థానం కోసం భారత్ కు దక్షిణాఫ్రికాతో పోటీ తప్పదు.

Visitors Are Also Reading