హాకీ ప్రపంచ కప్ టోర్నీ ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, హాకీ ప్రపంచ కప్ టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. స్పెయిన్ తో తలపడిన మ్యాచ్ లో 2-0 తో ఘనవిజయం సాధించింది. రవుర్కేలలోని బిర్సముండా స్టేడియంలో స్పెయిన్ తో జరిగిన పోరులో భారత్ ఆట ఆరంభం నుంచి స్పెయిన్ పై ఆధిపత్యాన్ని చెలాయించింది. భారత జట్టు వైస్ కెప్టెన్ అమిత్ రోహిదాస్ 12వ నిమిషంలో తొలి గోల్ కొట్టి ఖాతా తెరవగా, హార్దిక్ సింగ్ 26వ నిమిషంలో రెండో గోల్ కొట్టాడు.
Advertisement
దీంతో మ్యాచ్ ఆఫ్ టైం ముగిసేసరికి రెండు గోల్స్ తో ఆదిక్యంలో ఉంది. తర్వాత ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం కూడా అదే దూకుడు కొనసాగించి విజయాన్ని సొంతం చేసుకుంది. స్పేయిన్ పై విజయంతో భారత్ ఖాతాలో 3 పాయింట్లు నమోదయ్యాయి. సొంత గడ్డపై టైటిల్ పై కన్నేసి బరిలో దిగిన భారత ఆటగాళ్లు ఆట ఆరంభం నుంచి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బంతిని తమ ఆధీనంలో ఉంచుకునేందుకు ప్రయత్నించింది. తొలి క్వార్టర్ లో లభించిన పెనాల్టీ కార్నర్ ను టాప్ రైట్ కార్నర్ నుంచి గోల్ గా మలిచి రోహిత్ దాస్ భారత్ ఖాతా తెరిచాడు.
Advertisement
ప్రపంచ కప్ లో భారత్ కు ఇది 200వ గోల్. రెండో క్వార్టర్ లో మరో ఆటగాడు హార్దిక్ సింగ్ ఎడమవైపు కార్నర్ నుంచి వేసిన గోల్ ను స్పెయిన్ గోల్ కీపర్ అడ్డుకోలేకపోయాడు. దీంతో ఈ గోల్ భారత్ కు ఆటపై మరింత పట్టునిచ్చింది. భారత్ గోల్ కీపర్ మూడుసార్లు స్పెయిన్ ఆటగాళ్లు వేసిన గోల్స్ ను అడ్డుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వైస్ కెప్టెన్ అమిత్ రోహిత్ దాస్ నిలిచాడు. ప్రస్తుతం పూల్ డి లో మూడు పాయింట్లు తో భారత్ రెండో స్థానంలో ఉంది. పూల్ డిలో వేల్స్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో గెలిచిన ఇంగ్లాండ్ ఐదు పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. జనవరి 15న జరిగే తదుపరి మ్యాచ్ లో భారత్-ఇంగ్లాండ్ తో తలపడనుంది.
READ ALSO : Kalyanam Kamaneeyam Telugu Review : కళ్యాణం కమనీయం రివ్యూ