ఇతర దేశాల నుండి వస్తువులతోపాటు మనదేశంలో దొరకని కొన్ని పండ్లను సైతం భారత్ దిగుమతి చేసుకుంటోంది. అలా భారత్ ఇరాన్ దేశం నుండి కివి పండ్లను దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం మన దేశంలో ఈ పండ్లకు భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ విజృంభించిన సమయంలో కివి పండ్లకు ఎక్కువగా గిరాకీ ఉంటుంది. అయితే ఇకపై భారత్ లో కివి పండ్లు దొరకడం కష్టంగా మారనుంది. దానికి కారణం ఇరాన్ నుండి భారత్ కివి పండ్లను దిగుమతి చేసుకోవద్దని నిర్ణయం తీసుకోడమే.
Advertisement
ఇరాన్ లో ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల ఆ దేశానికి భారత్ మార్లు హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ మార్పు రాలేదు. దాంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ యాక్షన్ ప్లాన్ తీసుకుంది. డిసెంబర్ 7 నుండి కివి పండ్లను దిగుమతి చేయవద్దని నిర్ణయం తీసుకుంది. నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ జారీచేసిన ఫైట్ శానిటరీ సర్టిఫికెట్స్ ను 2021 డిసెంబర్ 8 నుండి పట్టించుకోవడం లేదు….అంటూ ఇరానియన్ కౌంటర్ పార్క్ కు భారత్ లేఖ ద్వారా తెలిపింది.
Advertisement
గతంలో భారత్ దిగుమతి చేసుకున్న కివి పండ్లలో పెస్టిసైడ్ శాతం ఎక్కువగా ఉందని అనేక సార్లు హెచ్చరించినప్పటికీ లెక్కచేయలేదని భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ బేసిస్ మీద పంపిన రిక్వెస్ట్ లను బైరాన్ లెక్క చేయలేదు… అందువల్లే అందువల్లే దిగుమతి నిలిపివేస్తున్నట్లు స్టేట్మెంట్ లో పేర్కొంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో పంపిన పండ్ల పై కూడా ఇన్వెస్టిగేషన్ జరుపుతామని పేర్కొంది.