భోగి పండుగ దక్షిణ భారతదేశంలో జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటకలలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రతి సంవత్సరం ఈ వేడుక జరిపిస్తారు. పిల్లలకు హానికరమైన లేదా అననుకూలమైనవి (వాటిని దిష్టి అని కూడా పిలుస్తారు) వారి జీవితాల నుండి తొలగిపోతాయని నమ్ముతారు.భోగి పండుగ నాడు పిల్లలకు కొత్త బట్టలు పెడతారు. వారికి హారతి నిర్వహిస్తారు, ఆపై భోగి పండ్లు, పూలు, చిల్లర నాణేలను కలిపి చిన్నారుల తలపై వేసి ఆశీర్వదిస్తారు.
Advertisement
ఈ పండుగ రోజున రేగి పళ్లనే చిన్నారుల తలపై పోస్తారు. వాటినే భోగిపళ్లు అని పిలుస్తారు. రేగి పండ్లనే ఎందుకు ఎంచుకుంటారంటే.. రేగి పళ్లల్లో పోషక విలువలను పెంచే శక్తీ బాగా ఉంటుంది. ఈ రేగి పళ్ళను తలపై పోసినప్పుడు వాటి ద్వారా వచ్చే వాయువు పిల్లల తలపై ఉండే బ్రహ్మ రంధ్రాన్ని చేరి పిల్లలకు శక్తినిస్తుంది. తలలో మెదడులో ఉండే నరాలు రేగి పళ్ళ వలన యాక్టివేట్ అవుతాయి. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనే శక్తీ రావాలి అన్న ఉద్దేశ్యంతోనే ఈ రేగి పళ్ళను తలపై పోస్తారు.
Advertisement
అలాగే శీతాకాలంలో ఉండే వాతావరణ మార్పుల వలన పిల్లల్లో ఆరోగ్యం క్షీణిస్తుంది. అదే ఈ భోగిపళ్ళను పోయడం వలన వారికి శక్తీ లభిస్తుంది. పిల్లలకు తగిలిన చెడు దృష్టి తొలగి పోవడం కోసం కూడా ఈ రేగి పళ్ళని పోయిస్తారు. వీటిల్లో ‘సి’విటమిన్ ఏక్కువగా ఉంటుంది. జీర్ణ సంబంధ సమస్యలను, ఉదర సంబంధ సమస్యలను తొలగించడంలో రేగు పళ్ళు ముందుంటాయి. సూర్యునిలా గుండ్రటి రూపం, ఎరుపు రంగు వలన వీటిని అర్కఫలం అని కూడా పిలుస్తారు. సంక్రాంతి సూర్యుడి పండగ. అందుకే సంక్రాంతి పండుగల్లో మొదటి రోజైన భోగి రోజున సూర్యుడికి ఇష్టమైన అర్క ఫలాలతోనే భోగి పళ్ళ వేడుకని జరిపిస్తారు.