సాధారణంగా మన ఇండ్లలో ఏ వంటకం చేసినా అందులో కరివేపాకు వేస్తే దాని రుచి మారిపోతుంది.. ముఖ్యంగా సాంబార్, తెలంగాణలో చాలా ఫేమస్ అయిన పచ్చిపులుసు లాంటి వాటిలో కరివేపాకు వేస్తె ఆ రుచే వేరు. అలాంటి కరివేపాకు మనం ఆహారం తినేటప్పుడు కనిపిస్తే పక్కన పడేస్తాం.. ఇలాంటి కరివేపాకులో పలురకాల పోషకాలు, ఔషధాలు దాగి ఉన్నాయి. ఇందులో మన శరీరానికి కావలసిన ఫాస్పరస్, క్యాల్షియం, ఐరన్, విటమిన్ బి, కెరటిన్ పుష్కలంగా ఉంటాయి.
Advertisement
మీ ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగజేస్తాయి. ముఖ్యంగా కరివేపాకులో కొవ్వు తగ్గించే గుణం ఉంటుంది. కరివేపాకును పొడిలా చేసుకుని రోజుకు ఒక టీ స్పూన్ తీసుకుంటే కొవ్వు ఇట్టే తగ్గిపోతుంది. గర్భిణీ స్త్రీలు ఒక స్పూన్ తేనె, నిమ్మరసంతో కలిపి కరివేపాకు పొడిని వేసి తీసుకుంటే వికారం లాంటి సమస్య తగ్గుతుంది. ప్రతి రోజు ఒక పది ముదురు కరివేపాకు ఆకులను నమిలి మింగాలి.
Advertisement
ఈ విధంగా మూడు నెలలపాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. పుల్లని పెరుగు లో కొద్దిగా నీళ్ళు చేర్చి అందులో కరివేపాకు, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు కలిపి తాగితే శరీరంలో ఉండే వేడి తగ్గుతుంది. కమిలిన గాయాలకు కర్వేపాకు గుజ్జు రాయడం వల్ల నొప్పి తొందరగా తగ్గుతుంది. ఈ విధంగా ప్రతి రోజు మనం తినే ఆహారంలో కరివేపాకును తప్పనిసరి చేసుకుంటే మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.
also read;
ఎన్టీఆర్ రాజీవ్ కనకాల మధ్య విభేదాలకు కారణం ఏంటి..? కలిసి ఎందుకు నటించడం లేదో తెలుసా..
వర్షాకాలంలో సంభవించే వ్యాధులకు చెక్ పెట్టేందుకు ఈ ఐదు పండ్లు తినాల్సిందే..!