ఐఏఎస్ అధికారుల్లో డైనమిక్ ఆఫీసర్ గా ఆమ్రపాలి పేరు తెచ్చుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఐఏఎస్ అధికారుల్లో ఈమె కూడా ఒకరు. వరంగల్ అర్బన్ కలెక్టర్ గా మూడేళ్లు పని చేశారు ఈయన.
Advertisement
కలెక్టర్ గా పనిచేసిన టైం లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువత లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది సోషల్ మీడియాలో కూడా ఈమె బాగా యాక్టివ్ గా ఉంటారు. వరంగల్ లో పని చేశాక పీఎంఓ కి బదిలీ మీద వెళ్లారు.
తాజాగా తెలంగాణకి తిరిగి వచ్చిన ఆమెని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెట్రో డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్ గా ఎంపిక చేశారు. కమిషనర్ గా నియమితులైన తర్వాత నెటిజెన్స్ ఆమెకి సంబంధించిన వివరాలని తెలుసుకోవడానికి ఆరా తీస్తున్నారు ఇక ఈమె గురించి పూర్తి వివరాలు చూస్తే.. 1982 నవంబర్ 4 న ఈమె విశాఖలో పుట్టారు. ఐఐటి మద్రాస్ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేశారు. తర్వాత బెంగళూరు ఐఐఎం నుండి పీజీ డిప్లమోనీ పూర్తి చేశారు.
Advertisement
తర్వాత ఈమె 2010లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆల్ ఇండియా 39వ ర్యాంక్ ని సాధించారు. ఐఏఎస్ కి ఎంపికైన అది చిన్న వయసుకుల్లో ఒకరిగా నిలిచారు. 2011 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన సమీర్ శర్మ ని ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2018లో వీళ్ళ పెళ్లి అయింది ఢిల్లీకి చెందిన సమీర్ 2011లో ఐఏఎస్ కి సెలెక్ట్ అయ్యారు. అమ్రపాలి ఒక తెలుగు అమ్మాయి. సమీర్ ఉత్తరాదికి చెందిన అతను. వీళ్ళిద్దరూ కొంతకాలం ప్రేమించుకోవడం తర్వాత పెద్దలు ని ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగాయి. జమ్ము లో సంప్రదాయం ప్రకారం వీళ్ళ పెళ్లిని పెద్దలు చేశారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!