తమిళనాడులో రాణిపేట జిల్లాలో విస్మయకర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి యూట్యూబ్ వీడియోలు చూసి,భార్యకు ఇంట్లోనే డెలివరీ చేశాడు. మతం ఫలితంగా మృత శిశువును ప్రసవించింది ఆమె తీవ్ర రక్తస్రావంతో ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. పాన పక్కం ప్రాంతంలో దుకాణం నడుపుతున్న ఓ వ్యక్తికి ఏడాది క్రితం వివాహమైంది. కొన్నాళ్ళకు భార్య (28)గర్భం దాల్చింది.
Advertisement
Advertisement
నెలలు నిండక టంతో డిసెంబర్ 18న ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. అయితే, ఆస్పత్రికి తీసుకెళ్లి బదులు ఇంట్లోనే బిడ్డను ప్రసవించిన చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో యూట్యూబ్ వీడియోలు చూడటం తో పాటు సోదరి ని అడిగి తెలుసుకున్నాడు.చాలా సేపటికి ఆమె ప్రస్తావించగా చనిపోయింది. మరోవైపు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను సమీపంలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై జిల్లా ఉప వైద్యాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఈ వ్యవహారం పై స్పందిస్తూ దీనిపై విచారణ జరుపుతామని ఇంకా ఎవరైనా కేసు నమోదు చేయలేదని చెప్పారు. భార్య అనుమతితోనే అతడు డెలివరీ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని వెల్లడించారు.