రాజస్థాన్ ప్లేయర్ అశ్విన్ పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధంగా అశ్విన్ నోరు పారేసుకున్నట్టు నిర్ధారించి… అతనికి భారీ జరిమానా విధించారు. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత అశ్విన్ చేసిన వ్యాఖ్యాలను తప్పుబట్టిన మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్… అశ్విన్ కు జరిమానా విధించారు. చెన్నైతో మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన రవిచంద్రన్ అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
READ ALSO : మెగాస్టార్ కూతురితో ఉదయ్ కిరణ్ పెళ్లి..అతని వల్లే ఆగిపోయిందట…!
Advertisement
ఈ అవార్డు అందుకున్న తర్వాత అశ్విన్ మాట్లాడుతూ అంపైర్లపై విమర్శలు చేశాడు. డ్యూ ఉందని అంపైర్లు బంతిని మార్చడాన్ని తప్పు పట్టారు. ఇలా బంతిని మార్చడం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. అంపైర్లు బాల్ ను మార్చడం చూసి షాక్ అయ్యానని అన్నాడు. తమను అడగకుండానే అంపైర్లు బంతిని మార్చడం ఏంటో తనకు అర్థం కాలేదన్నారు.
Advertisement
READ ALSO : Vidudhala Part 1 Review – ‘విడుదల’ రివ్యూ..అంచనాలకు మించి ఉందిగా !
ఈ విషయంపై అంపైర్ ను అడగ్గా అలా చేసే అధికారం తమకు ఉందని చెప్పారని తెలిపారు. ఇది తమకు అనుకూలమైన నిర్ణయమే అయినా ఇలా చేయడం తనకు నచ్చలేదన్నారు. బహిరంగంగా విమర్శించాడు. అశ్విన్ చేసిన వాక్యాలు ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో అతని మ్యాచ్ ఫీజులు, మ్యాచ్ రిఫరీ 25% కోత విధించారు. అశ్విన్ వాక్యాలు ఐపిఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ 2.7 ప్రకారం లెవెల్ 1 తప్పిదంగా పరిగణించి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
read also : ఏపీ సీఎం జగన్ పరువు తీసిన శ్రీ రెడ్డి..అవమానిస్తున్నాడంటూ !