ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో సంతోషంగా ఉండాలని అనుకుంటారు రిలేషన్షిప్ బాగుండాలని ప్రేమ పెరగాలని ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటూ జీవితమంతా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఎవరు కూడా మా లైఫ్ లో గొడవలు రావాలి మేము విడిపోవాలని అనుకోరు. మీ జీవిత భాగస్వామితో మీ బంధం బాగుండాలంటే ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గొడవ తర్వాత కాసేపు అలా ఈ మాటల్ని వదిలేసి కాసేపు తర్వాత తిరిగి మళ్ళీ సమస్యని పరిష్కరించుకోవడానికి మాట్లాడాలి. మీ జీవిత భాగస్వామిని ఒప్పించే ముందు కొన్ని విషయాలని గుర్తుపెట్టుకోండి. లేకపోతే వాళ్ళు బాగా కోప్పడతారు మీ జీవిత భాగస్వామి కోపంలో ఉన్నప్పుడు పలు అర్థాలని తీసుకునే అవకాశం ఉంది.
Advertisement
Advertisement
కాబట్టి మీరు క్షమాపణలు చెప్పినప్పుడల్లా మీ మాటలు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అప్పుడు పొరపాటు జరగదు. అలానే మీరు మీ తప్పుని అంగీకరించండి మీరు కనుక మీ తప్పుని అంగీకరిస్తే ఖచ్చితంగా మళ్లీ మీరు సంతోషంగా ఉండొచ్చు. మీ బంధం దృఢంగా మారుతుంది. ఏదైనా బహుమతిని ఇవ్వండి. ఇది కూడా మీ జీవిత భాగస్వామిని సంతోష పరుస్తుంది/ భరోసా ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. అలానే కొన్ని పొరపాట్లకు మీరు మీ జీవిత భాగస్వామికి క్షమాపణలు చెప్పాలి ఇలా చేస్తే సంతోషంగా మీ బంధం సాగుతుంది ఏ బాధ ఉండదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!