ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితాన్ని అందంగా మార్చుకోవాలని అనుకుంటుంటారు. జీవితాన్ని అందంగా మార్చే అలవాట్లు ఇవి. వీటిని కనుక పాటించునట్లయితే జీవితాన్ని అందంగా మార్చుకోవచ్చు. జీవితం అందంగా సంతోషంగా ఉండాలంటే, ప్రత్యేకంగా ఒక నియమం, సూత్రాన్ని పాటించాలి అని ఏమీ లేదు. అయితే అలవాట్లతో జీవితాన్ని అందంగా మార్చుకోవచ్చు సంతోషంగా ఉండొచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన తినే ఆహారమే ఆయుషు ని పెంచుతుంది. సీజన్ ఫ్రూట్స్ కూరగాయలు వంటి వాటిని దగ్గర తీసుకుంటూ ఉండండి. వ్యాయామం చేయడం చాలా మంచి అలవాటు.
Advertisement
శారీరక మానసిక ఆరోగ్య అనేది పెంపొందిస్తుంది. అలానే ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే, విశ్రాంతి విషయంలో రాజీ పడకూడదు. రోజు ఆరు నుండి ఏడు గంటల పాటు నిద్రపోవాలి. మన ఆరోగ్యం పై నిద్ర కూడా ప్రభావం చూపిస్తుందని గుర్తు పెట్టుకోండి. ఒత్తిడి ఆందోళన మనసును పాడు చేయడమే కాకుండా శరీరాన్ని అలసి పోయే విధంగా చేస్తుంది దీనిని అధిగమించడానికి రోజు పది నిమిషాల పాటు శ్వాసవ్యాయములు చేయండి ఇలా చేస్తే కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు.
Advertisement
నీటి శాతం తక్కువ ఉంటే కండరాల్లో ఒత్తిడి కలుగుతుంది. కడుపునొప్పి ఉబ్బరం ఇలా పలు సమస్యలు కలుగుతాయి. శరీరం డిహైడ్రేషన్ అవుతుంది అందుకని తగినంత నీళ్లు తాగాలి. స్నేహితులు బంధువులను కలవడం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేస్తే మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అధిక బరువు అనేక వ్యాధులకు కారణమవుతుంది బరువు తగ్గించుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. టీవీ, మొబైల్, సిస్టం ముందు ఎక్కువ సేపు గడపకూడదు ఇది క్రమంగా ఒంటరితనానికి దారితీస్తుంది డిప్రెషన్ వంటివి కలుగుతాయి సో స్క్రీన్స్ కి దూరంగా ఉండడం కూడా మంచిది. ఇలా వీటిని కనుక మీరు పాటించునట్లైతే మీ జీవితాన్ని మీరు అందంగా మార్చుకో వచ్చు అంతే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!