ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఉద్యోగాలతో పరుగులు తీస్తున్నారు. ఉద్యోగం వలన మళ్ళీ ఇంటికి వచ్చి పనులు చేసుకోవడం ఇలా సమయం లేక ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏం చేయాలి..? ఒత్తిడి నుండి బయట పడాలంటే ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఒత్తిడి నుండి దూరంగా ఉంచడానికి మచ్చ టీ బాగా ఉపయోగపడుతుంది మచ్చ టీ లో అమైనో యాసిడ్స్ నాడీ వ్యవస్థ పై కెఫెన్ ప్రభావం తగ్గిస్తుంది దీంతో ఏకాగ్రత పెరిగి ఒత్తిడి బాగా తగ్గుతుంది. అలానే ఒత్తిడిని తగ్గించుకోవడానికి డార్క్ చాక్లెట్ బాగా ఉపయోగపడుతుంది. డార్క్ చాక్లెట్లో పాలీ ఫినోల్స్ ఉంటాయి. ఇవి హ్యాపీ హార్మోన్స్ లెవెల్స్ ని పెంచుతాయి దీంతో ఒత్తిడి బాగా తగ్గుతుంది.
Advertisement
Advertisement
అలానే పీనట్ బెటర్ జ్ఞాపకశక్తిని పెంచి ఒత్తిడిని దూరం చేస్తుంది. ఉల్లాసంగా మిమ్మల్ని ఉంచుతుంది. ఫ్యాటీ ఫిష్ ని తీసుకుంటే కూడా ఒత్తిడి దూరం అవుతుంది. దీని వలన మీకు మంచి మూడ్ కూడా వస్తుంది. మానసిక కుంగుబాటు కూడా దూరం అవుతుంది. బ్లూబెర్రీస్ తీసుకుంటే కూడా ఒత్తిడి నుండి దూరంగా ఉండొచ్చు. బ్లూబెర్రీస్ తీసుకోవడం వలన ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. మనసు కుదుటపడుతుంది. పులియపెట్టిన ఆహార పదార్థాలని తీసుకుంటే కూడా ఒత్తిడి తగ్గుతుంది. ఆందోళన కూడా తగ్గుతుంది.
అరటి పండ్లు తింటే కూడా ఒత్తిడి బాగా తగ్గుతుంది అరటి పండ్లను తింటే బాడీలో సెరటానిన్ ఉత్పత్తి అవుతుంది. విటమిన్ b6 కూడా ఇందులో ఉంటుంది. మంచి మూడ్ ని కల్పించడానికి అరటిపండు సహాయపడుతుంది. కొబ్బరిలో కూడా పోషకాలు ఉంటాయి. తక్షణ శక్తిని ఇవి ఇస్తాయి. ఇలా ఈ ఆహార పదార్థాలని కనుక మీరు తీసుకున్నట్లయితే కచ్చితంగా ఒత్తిడి తగ్గుతుంది. రోజు కాసేపు వ్యాయామం మెడిటేషన్ చేస్తే కూడా ఒత్తిడి తగ్గుతుంది వీలైనంత వరకు ఆనందంగా ఉండడానికి చూసుకోండి.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!