చాణక్య జీవితంలో జరిగే విషయాల గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన ప్రతి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చాణక్య చెడు స్వభావం ఉన్న వ్యక్తిని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని చెప్పారు. చెడు స్వభావం ఉన్న వ్యక్తుల గురించి చాణక్య వివరించడం జరిగింది. ఆచార్య చాణక్య చెప్పిన దాని ప్రకారం దాతృత్వం, మాధుర్యం, ధైర్యం, తెలివి ప్రవర్తనని ఎవరు బోధించలేరు. ఈ లక్షణాలు ప్రతి మనిషికి వారి ప్రవర్తనలో అంతర్లీనంగా ఉండాలని చెప్పారు. అంటే సహజంగా ఈ లక్షణాలు మనిషి ప్రవర్తనలో ఉండాలి.
Advertisement
Advertisement
మానసిక బలం ముఖ్యమని కూడా చాణక్య అన్నారు. ఎప్పుడూ ఇంట్లో ఉండే వ్యక్తి ప్రపంచ జ్ఞానాన్ని పొందలేరని చాణక్య అన్నారు. అత్యాశ గల వ్యక్తి ఎప్పటికీ నిజం మాట్లాడలేడని వేటగాళ్లు ఎప్పుడూ కూడా హృదయపూర్వకంగా ఉండలేరని చెప్పారు చాణక్య. ఎప్పుడూ కూడా స్వచ్ఛమైన ఆలోచనలని కలిగి ఉండాలని చాణక్య చెప్పారు. అలానే కోపం అనేది సహజమైన మానవ భావోద్వేగం అనవసరంగా కోపగించుకుంటూ చుట్టూ ఉన్న వాళ్ళకి జీవితం కష్టాన్ని కలిగించకూడదని చాణక్య అన్నారు.
గొడవలు సృష్టించే వ్యక్తితో కలిసి ఉంటే శాంతి ఉండదని చాణక్య అన్నారు. చెడు ప్రవర్తన ఉన్నవాళ్లు ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారని చాణక్య అన్నారు. అలానే కొంతమంది స్వలాభం కోసం అబద్దాలు చెప్తారని చిన్నప్పటినుండి ఆ అలవాటు కొందరికి ఉంటుందని అలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళకి ద్రోహం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారని చెప్పారు చాణక్య.
మరిన్ని తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!