భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) తన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆధార్ కార్డ్ ఉన్నవారు అందరికి అనేక రకాల సేవలను అందిస్తుంది. ఈ సేవల్లో ఒకటి UIDAI అధికారిక వెబ్‌సైట్ నుండి ఆధార్ PVCని డౌన్‌లోడ్ చేయడం. మీరు UIDAI వెబ్‌సైట్ నుండి మీ ఆధార్ PVCని డౌన్‌లోడ్ చేయాలనుకుంటే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకపోయినా పర్లేదు. మీ ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ లింక్ చేయకుండానే మీరు ఈ సేవను వాడుకునే అవకాశం ఉంది.
Advertisement
UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి… మై ఆధార్ మీద క్లిక్ చేసి… ఆధార్ నంబర్‌ను నమోదు చేసి కింద పేర్కొన్న వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
Advertisement
UIDAI అధికారిక వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి మై ఆధార్ పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు, ‘ఆర్డర్ ఆధార్ PVC కార్డ్’ పై క్లిక్ చేసి, మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
కింద స్పేస్‌లో క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
ఇప్పుడు, ‘మై మొబైల్ నంబర్ నాట్ రిజిస్టర్ ‘ మీద క్లిక్ చేయాలి.
OTP రావడానికి ప్రత్యామ్నాయ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
పేజీలో OTPని ఎంటర్ చేసి, ‘ సబ్‌మిట్’పై క్లిక్ చేయండి.
మీ స్క్రీన్‌పై ఆధార్ ప్రివ్యూ చూపిస్తారు.
మీ ఆధార్ వివరాలను క్రాస్ చెక్ చేయండి. ఆన్లైన్ లో పే చేయండి.
మీ వద్ద మీ 12-అంకెల ఆధార్ నంబర్ అందుబాటులో లేకుంటే, మీరు ఈ మొత్తం ప్రక్రియ కోసం బదులుగా మీ 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (VID)ని కూడా ఉపయోగించవచ్చు.