Home » ముఖ్య మంత్రి అయిన తరువాత కూడా దర్శకులతో ఎన్టీఆర్ ఎలా ప్రవర్తించేవారు ?

ముఖ్య మంత్రి అయిన తరువాత కూడా దర్శకులతో ఎన్టీఆర్ ఎలా ప్రవర్తించేవారు ?

by Sravya
Ad

సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సీనియర్ ఎన్టీఆర్ ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఒకపక్క రాజకీయాలతో ఇంకొకపక్క సినిమాలు తో ప్రజలకు దగ్గరగా ఉండేవారు. పైగా పార్టీ పెట్టిన కొద్ది కాలంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు.

sr-ntr-as-cm

Advertisement

ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు. కొంతకాలం పాటు రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కొత్త పథకాలను కూడా తీసుకువచ్చారు. ఆ టైంలోనే తనకు కొడుకు బాలయ్య హీరోగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వకముందు అయితే ఎన్టీఆర్ చెప్పినట్లుగా బాలయ్య సినిమాలు చేసేవారు. కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీ అవడంతో బాలయ్య సొంత నిర్ణయాలను తీసుకోవడం మొదలుపెట్టారు వరుసగా పలు సినిమాల్లో అపజేయాలని అందుకున్నారు.

Advertisement

ఈ పరిస్థితి కనుక కొనసాగిందంటే బాలయ్య కెరియర్ కి కష్టమని భావించారు ఎన్టీఆర్. అందుకే తన స్వయంగా ఒక సినిమాని నిర్మించాలని భావించారు. ఆ టైంలో వరుస విజయాలతో దర్శకుడు కోదండరామిరెడ్డిని తను నిర్మించబోయే సినిమాకి దర్శకత్వం వహించాలని కోరారు ఈ విషయాన్ని బాలయ్య మానేజర్ చెప్పడం జరిగింది. మీకు సరే అంటే ఏంటి కలవండి అని చెప్పారు సరే అన్నా ఆయన మద్రాస్ నుండి హైదరాబాద్ కి వచ్చి ఎన్టీఆర్ ని కలిశారు. తెల్లవారుజామున 4:30 కి అబిడ్స్ లోని ఎన్టీఆర్ వద్ద నిలబడ్డారు విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ బయటకి వచ్చారు ఆప్యాయంగా పలకరించారు.

లోపలికి తీసుకువెళ్లారు. సినిమా పూర్తి బాధ్యత తన మీద పెట్టారు మొత్తానికి బాలయ్య కోసం ఒక మంచి సినిమా కథని రెడీ చేశారు. ఓ రోజు ఫైనల్ డిస్కషన్ జరిగింది ఎన్టీఆర్ కి కూడా ఈ సినిమా కథ నచ్చడంతో ఓకే చెప్పేసారు దర్శకుడిగా ఎంతో గౌరవం ఇచ్చేవారు. తన కొడుకు సినిమా కెరియర్ ని మలుపు తిప్పబోతున్న వ్యక్తికి ఎంతగానో గౌరవం ఇచ్చారట. సినిమా విషయం పక్కన పెడితే, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన దర్శకులతో ఇలా ప్రవర్తించారనేది చెప్పుకోదగ్గ విషయం.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading